పెద్ద స్కెచ్చే వేశాడు... మహేష్ బాబు సినిమాకు నిర్మాతగా కొరటాల శివ!
మహేష్ బాబు హీరోగా శ్రీమంతుడు, భరత్ అనే నేను లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన కొరటాల శివ త్వరలో నిర్మాత అవతారం ఎత్తబోతున్నారు. అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందబోయే చిత్రానికి... వినడానికి కాస్త విచిత్రంగా ఉన్నా ఇది నిజమే అని అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు.
మహేష్ బాబు తన 26వ చిత్రం అనిల్ రావిపూడి దర్శకత్వంలో కమిటైన సంగతి తెలిసిందే. ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది. తర్వాత చేయబోయే 27 చిత్రం కూడా దాదాపుగా ఖరారైనట్లే అని టాక్. దీనికి పరశురాం దర్శకత్వం వహించబోతున్నారు.
కొరటాల శివ ద్వారా మహేష్ బాబును కలిసిన పరశురాం తన వద్ద ఉన్న స్టోరీ లైన్ చెప్పి సూపర్ స్టార్‌ను ఒప్పించారని తెలుస్తోంది. కొరటాల శివ ఇంత చొరవ తీసుకుని పరశురాంకు సహాయం చేయడానికి కారణం ఈ సినిమా నిర్మాణంలో తాను భాగస్వామ్యం కావాలనే ఆలోచనే అని అంటున్నారు.

ఈ చిత్రాన్ని నిర్మించబోయేది గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అని కొన్ని రోజుల క్రితం వార్తలు వినిపించాయి. అయితే ఇపుడు సీన్ మారింది. కొరటాల శివ తన స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్‌తో కలిసి యువ సుధా ఆర్ట్స్ బేనర్లో ఈ మూవీ నిర్మించబోతున్నారట. అయితే గీతా ఆర్ట్స్ నుంచి ఈ ప్రాజెక్ట్ వీరి చేతికి ఎలా వచ్చిందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.... పరశురాం దర్శకత్వంలో కొరటాల శివ నిర్మాతగా తన 27వ చిత్రం కంప్లీట్ అయ్యాక.... కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ చేసేందుకు మహేష్ బాబు ప్లాన్ చేసుకుంటున్నారట. అదే జరిగితే వీరి కాంబినేషన్లో వచ్చే 3వ చిత్రం అవుతుంది.


Click it and Unblock the Notifications











