twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    NTR 30 విషయంలో కొరటాల కీలక నిర్ణయం.. ఆ సెటిల్మెంట్స్ కోసం వెయిటింగ్.. అది అయ్యాకే?

    |

    మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ కీలక పాత్రలో తెరకెక్కిన ఆచార్య సినిమా కొద్ది రోజుల క్రితం తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా ఊహించిన మేర ఫలితాలు అందుకోలేక పోయింది. మిశ్రమ ఫలితాన్ని అందుకున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు పెట్టుకోగా సినిమా మాత్రం అంచనాలను అందుకోవడంలో విఫలమైంది.. అయితే ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ కీలక నిర్ణయం తీసుకున్నారు అంటూ ప్రచారం జరుగుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..

    మార్పులు చేర్పులు

    మార్పులు చేర్పులు


    భరత్ అనే నేను లాంటి సూపర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా అనౌన్స్ చేశారు. తొలుత ఈ సినిమాలో మహేష్ బాబు ఒక పాత్రలో నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ స్థానంలో రామ్ చరణ్ నటిస్తాడని వెల్లడించారు. రామ్ చరణ్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన తర్వాత సినిమా కథకు అనేక మార్పులు చేర్పులు చేసినట్టు కూడా ప్రచారం జరిగింది.

    ఆకట్టుకోవడంలో విఫలమయ్యి

    ఆకట్టుకోవడంలో విఫలమయ్యి


    అలాగే తొలుత చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ తర్వాత ఆమెను పాత్రను పూర్తిగా తొలగించారు. రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ మీద రామ్ చరణ్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడిన అనంతరం ఈ సినిమా ఈ మధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది కానీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమయ్యింది.

    కొరటాల శివ దగ్గర ఉండి

    కొరటాల శివ దగ్గర ఉండి


    అయితే ఈ సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు కూడా భారీగా నష్టపోయిన పరిస్థితుల్లో ప్రస్తుతానికి కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు అండగా నిలబడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి చిరంజీవి అమెరికా పర్యటనలో ఉండడం రామ్ చరణ్ తేజ శంకర్ సినిమా షూటింగ్లో బిజీగా ఉండటంతో డిస్ట్రిబ్యూటర్ల నష్టాల విషయాలు కూడా కొరటాల శివ దగ్గర ఉండి చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.

     చక్కబెట్టిన తర్వాత

    చక్కబెట్టిన తర్వాత


    నిరంజన్ రెడ్డి ఒకపక్క రాజ్యసభ సీటు ప్రకటించడంతో కాస్త బిజీ అయ్యారని ఈ నేపథ్యంలోనే అందరి తరపున కొరటాల శివ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తున్నారని చెబుతున్నారు. ఒకసారి ఈ సినిమాకి సంబంధించిన అన్ని విషయాలు క్లియర్ అయితేనే తదుపరి సినిమాకు అయ్యేవిధంగా కొరటాల శివ ప్లాన్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. అందుకే కొన్ని రోజుల పాటు ఎన్టీఆర్ ను ఆగ వలసిందిగా కూడా కోరారని వీలైనంత త్వరలో ఆచార్య వ్యవహారాలు చక్కబెట్టిన తర్వాత ఎన్టీఆర్ తో సినిమా మీద దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

     రావాల్సిన మొత్తం వచ్చాక

    రావాల్సిన మొత్తం వచ్చాక


    ఆచార్య సినిమాకు డిజిటల్, శాటిలైట్ హక్కుల నుంచి రావాల్సిన మొత్తం వచ్చాక ఈ వ్యవహారం పూర్తి చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఎన్టీఆర్ కెరియర్లో 30వ సినిమాగా తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి కొరటాల శివ స్నేహితుడు మిక్కిలినేని సుధాకర్ ఒక నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటే ఎన్టీఆర్ సోదరుడు కళ్యాణ్ రామ్ కు చెందిన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కూడా సహా నిర్మాణ సంస్థగా వ్యవహరిస్తోంది. వీలైనంత త్వరలో ఆచార్య వ్యవహారాలు చక్కబెట్టి ఎన్టీఆర్ సినిమా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

    English summary
    koratala siva is busy in acharya final settelments
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X