‘చిరు’తో గ్యాప్... ఆ డబ్బంతా కొరటాల శివ ఇటు వైపు మళ్లిస్తున్నాడా?
మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ లాంటి చిత్రాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరిగా హవా కొనసాగిస్తున్న కొరటాల శివ త్వరలో నిర్మాతగా మారుతున్నారట.
ఫోర్బ్స్ ప్రతిక ప్రకటించిన వివరాల ప్రకారం సంపాదనలో గతేడాది కొరటాల శివ పెద్ద పెద్ద దర్శకులను సైతం మించిపోయాడు. సినిమాల ద్వారా సంపాదించిన కోట్ల రూపాయలను మళ్లీ సినిమా రంగంలోనే పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆయన ఓ చిన్నబడ్జెట్ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు సమాచారం.

‘చిరు'తో గ్యాప్
కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి సినిమా రాబోతోందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ‘సైరా' షూటింగ్ ముగిసిన వెంటనే కొరటాల ప్రాజెక్ట్ మొదలవుతుందని అంతా భావించారు. అయితే ఇంతలోనే చిరంజీవి తాను త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. దీంతో మెగాస్టార్‌తో చేయబోయే సినిమా విషయంలో కొరటాలకు గ్యాప్ ఏర్పడక తప్పడం లేదు.

సమయం వృధా చేయకుండా....
చిరంజీవితో సినిమా మొదలు పెట్టడానికి ఇంకా చాలా సమయం ఉండటంతో ఈ గ్యాపులో ఓ చిన్న సినిమాను నిర్మించాలని కొరటాల డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. త్వరలోనే తన సొంత ప్రొడక్షన్ మొదలు పెట్టేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు.

పక్కా ప్లానింగుతో సూపర్ హిట్లు కొడుతున్న కొరటాల శివ
సినిమా ఇండస్ట్రీలో రచయితగా కెరీర్ మొదలు పెట్టిన కొరటాల శివ 2013లో ‘మిర్చి' సినిమా ద్వారా దర్శకుడిగా మారారు. వరుస కమిట్మెంట్లతో ఆదరాబాదరాగా సినిమాలు చేయకుండా పక్కా ప్లానింగుతో బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేస్తున్నాడు.

వరుస బ్లాక్‌బస్టర్స్
కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన మిర్చి(2013), శ్రీమంతుడు(2015), జనతా గ్యారేజ్(2016), భరత్ అనే నేను(2018) బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న సంగతి తెలిసిందే. త్వరలో ఆయన చిరంజీవితో చేసే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Click it and Unblock the Notifications











