కొరటాల శివ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఇదే.. మళ్ళీ అదే తరహాలో..

జూనియర్ ఎన్టీఆర్ RRR అనంతరం కొరటాల శివతో ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమా అనంతరం మళ్ళీ ఎలాంటి సినిమా చేస్తాడు అని అనుకుంటున్న తరుణంలో తారక్ త్రివిక్రమ్ ను పక్కన పెట్టేసి కొరటాల శివను సెలెక్ట్ చేసుకోవడం అందరిని ఆశ్చర్యపరిచింది. చాలా తక్కువ సమయంలో నిర్ణయం తీసుకున్నప్పటికీ ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలుస్తోంది.

నవ్వుతూనే గుండెల్ని పిండేస్తున్న షీలా రాజ్

అసలైతే కొరటాల శివ 7 కథలను మిర్చి కంటే ముందే రెడీ చేసుకున్నాడట. వాటినే కాలానికి తగ్గట్లుగా మార్చుకుంటు వస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇక కొరటాలతో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమాతో హిట్టు కొట్టిన ఎన్టీఆర్ ఆ సమయంలో రెండు మూడు కథలపై చర్చలు జరిపాడట. ఇక 30వ సినిమా స్టోరీ లైన్ కూడా చాలా రోజుల క్రితం విన్నదే అని టాక్ వస్తోంది. లాక్ డౌన్ లో శివ ఆ కథను మరింత డెవలప్ చేసుకున్నాడట.

Koratala siva jr ntr main story and hero charecter

ఒక చిన్న టౌన్ నుంచి వచ్చే కుర్రాడు నగరంలో అడుగు పెట్టిన అనంతరం అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు. నేషనల్ లెవెల్లో జరిగే మోసాన్ని ఎలా అడ్డుకున్నారు అనే పాయింట్ ను హైలెట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కథ ఫార్మాట్ పాతదే అయినా కూడా మేకింగ్ బ్యాక్ గ్రౌండ్ మొత్తం చాలా కొత్తగా ఉంటుందట. నెవర్ బిఫోర్ అనేలా యాక్షన్ సెక్వెన్స్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ లో సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతున్న విషయం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X