twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : కొరటాలకు రూ.30 కోట్లు నష్టమా?.. దానికి మెగాస్టారే కారణమా?

    |

    కొరటాల శివ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన తీసే సినిమాలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. ఏ సినిమాను తెరకెక్కించినా అందులో ఏదో ఒక సందేశాన్ని ఇవ్వడం ఆయన ప్రత్యేకత. ఆయన తెరకెక్కించిన సినిమా కథలు ఎక్కడో చూసినట్టు అనిపించినా.. తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తాడు. రెండున్నర గంటల సేపు ప్రేక్షకులను అలా కూర్చుండబెట్టేస్తాడు. ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన ప్రతీ సినిమా బ్లాక్ బస్టరే కావడం, ప్రతీ దాంట్లోనూ సమాజానికి ఉపయోగపదే సందేశం ఇవ్వడంతో కొరటాల అందరికంటే ప్రత్యేకంగా నిలిచాడు. అలాంటి కొరటాలకు ముప్పై కోట్ల మేర నష్టం వచ్చిందంటా? దానిని కారణం చిరంజీవి అంటా. ఆ వార్తల కథేంటో ఓ సారి చూద్దాం.

     టైమింగ్‌ను పాటించే డైరెక్టర్..

    టైమింగ్‌ను పాటించే డైరెక్టర్..

    కొరటాల శివకు సమయ పాలన అంటే ఇష్టం. అన్నీ టైమ్ ప్రకారం, అనుకున్న సమయానికి జరిగిపోవాలి. దర్శకుడిగా మారింది కూడా లేటు వయసులోనే కాబట్టి.. తనకున్న సమయాన్ని సరిగ్గా వాడుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. అందుకే ఆయన సినిమా సినిమాకు గ్యాప్ ఎక్కువగా ఇవ్వడు.

    భరత్ అనే నేను వచ్చి..

    భరత్ అనే నేను వచ్చి..

    మహేష్ బాబు‌తో చేసిన భరత్ అనే నేను చిత్రమే కొరటాలకు చివరిది. అయితే ఆ చిత్రం తరువాత మహేష్ బాబు మహర్షి, సరిలేరు నీకెవ్వరు అంటూ రెండు చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చాడు. కానీ కొరటాల మాత్రం ఒకే స్క్రిప్ట్‌ను పట్టుకుని ఉన్నాడు. ఇప్పటికీ ఆ చిత్ర పనుల్లోనే ఉన్నాడు.

     ఆలస్యమవుతూనే వస్తోంది..

    ఆలస్యమవుతూనే వస్తోంది..

    ఇంత వరకు కొరటాల శివ ఆలస్యం చేసింది లేదు. ప్రతీ సినిమాను వెంట వెంటనే పూర్తి చేసేస్తాడు. అయితే సైరా సినిమా ఏడాది పాటు ఆలస్యం కావడం మొత్తం దెబ్బ కొట్టేసింది. ఆ గ్యాప్ మరో చిత్రాన్ని చేసే వీలున్నా కొరటాల చేయలేకపోయాడు. పోనీ ఆచార్య ఏమైనా త్వరగా వస్తుందా? అంటే అదీ చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

    Recommended Video

    #HappyBirthdayAlluArjun: Allu Arjun Special Gift To Fans
    దాదాపు ముప్పై కోట్లు..

    దాదాపు ముప్పై కోట్లు..

    అసలే దర్శకుడిగా ఆయన పీక్స్‌లో ఉన్నాడు.. సినిమాకు పదిహేను కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్.మెగాస్టార్ కోసమే రెండు మూడేళ్లు వేచి చూశాడు కాబట్టి ఆ నష్టం ఆయన వల్లే జరిగినట్టు టాక్ నడుస్తోంది. కరోనా దెబ్బకు ఆచార్య ఈ ఏడాది అయినా వస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. అసలే రిటైర్ అవ్వాలనే ఉద్దేశ్యంలో ఉన్నానని, ఇంకా ఐదారు సినిమాలే చేస్తానని పేర్కొన్న సంగతి తెలిసిందే. అసలే దర్శకుడిగా ఆయన పీక్స్‌లో ఉన్నాడు.. సినిమాకు పదిహేను కోట్ల వరకు తీసుకుంటున్నాడని టాక్.

    English summary
    Koratala Siva Losses 30 Crores Due To Chiranjeevi. It reported that, Koratala is losing Rs 30 Crore on Chiranjeevi's ongoing film Acharya. It is known that, Chiranjeevi signed Koratala Siva nearly two years ago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X