twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగాస్టార్ డ్యూయెల్ రోల్ సినిమాకు కొరటాల బిగ్ ప్లాన్.. భాగస్వామిగా కూడా!

    |

    మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి చిత్రంలో నటిస్తున్నాడు. సైరా నరసింహారెడ్డి చిత్రం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సురేందర్ రెడ్డి దర్శత్వంలో ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా చిరంజీవి తదుపరి చిత్రం గురించి కూడా చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. కొరటాల శివ దర్శత్వంలో చిరు నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    డ్యూయెల్ రోల్‌లో మెగాస్టార్

    డ్యూయెల్ రోల్‌లో మెగాస్టార్

    భరత్ అనే నేను చిత్రంతో తన విజయపరంపర కొనసాగించిన కొరటాల శివ ప్రస్తుతం చిరంజీవి కోసం అద్భుతమైన కథ సిద్ధం చేస్తున్నాడట. ఈ చిత్రంలో చిరంజీవి డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ నుంచి వార్తలు వస్తున్నాయి. సందేశాత్మక చిత్రాలకు కమర్షియల్ అంశాలు జోడించి కొరటాల విజయం సాధిస్తున్నాడు.

    మాస్టర్ ప్లాన్

    మాస్టర్ ప్లాన్

    చిరంజీవి సినిమా విషయంలో కొరటాల శివ మాస్టర్ ప్లాన్ రచించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి కొరటాల కేవలం దర్శకుడిగా మాత్రమే కాక నిర్మాణంలో భాగస్వామిగా కూడా మారే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ నిర్మాణ సంస్థతో కొరటాల శివ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.

    ఇక ఆ బ్యానర్‌లోనే

    ఇక ఆ బ్యానర్‌లోనే

    యువసుధ ఆర్ట్స్ అనే సంస్థతో కొరటాల శివ సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తన తదుపరి చిత్రాలలో ఎక్కువ భాగం ఈ బ్యానర్ లోనే తెరకెక్కించి నిర్మాణంలో కూడా భాగస్వామి కావాలనేది కొరటాల ప్లాన్ అని చెప్పుకుంటున్నారు. చిరంజీవి చిత్రం కూడా ఇదే బ్యానర్ లో ఉండబోతోందట.

     అభిమానుల్లో ఆసక్తి

    అభిమానుల్లో ఆసక్తి

    స్వయంగా కొరటాల శివే నిర్మాణంలోకి దిగితే ఆ చిత్రంపై ఎంత శ్రద్ద తీసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఖచ్చితంగా మెగాస్టార్ కోసం ఓ పవర్ ఫుల్ కథని కొరటాల సిద్ధం చేసి ఉంటాడని అభిమానుల్లో, సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. కొరటాల తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలన్నీ ఘనవిజయాన్ని అందుకున్నాయి.

    English summary
    Koratala Siva master plan for Megastar Chiranjeevi movie. Koratala Siva may involved in Production
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X