Don't Miss!
- News వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్దికి సతీమణి షాక్ - రెబల్ గా బరిలోకి..!!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
అల్లు అర్జున్ సినిమాకు కొరటాల గట్టిగానే లాగుతున్నాడు.. క్లిక్కయితే కుబేరుడే!
టాలీవుడ్ స్టార్ దర్శకుల్లో ఒకరైన కొరటాల శివ డైరెక్టర్ గా ఇంతవరకు ఫెయిల్యూర్ అన్నది చూడలేదు. దర్శకధీరుడు రాజమౌళి తరువాత కొరటాల ఆ రికార్డు దిశగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రయోగాలతో రిస్క్ చేయకుండా మంచి సోషల్ మెస్సేజ్ పాయింట్ హైలెట్ చేస్తూ సినిమాలను తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు కొరటాల ప్లాన్స్ వర్కౌట్ అవుతున్నాయి. ఇక బన్నీ సినిమాకు కొరటాల మునుపెన్నడు చూడనంత రెమ్యునరేషన్ అందుకోబోతున్నట్లు తెలుస్తోంది.
మొదటి సినినకు తక్కువ రెమ్యునరేషన్
రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేసిన కొరటాల శివ ప్రభాస్ మిర్చి సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమైన విషయం తెలిసిందే. మొదటి సినిమాకు కోటి కంటే తక్కువ అందుకున్న కొరటాల ఆ తరువాత శ్రీమంతుడు సినిమాతో రెమ్యునరేషన్ డోస్ ని ఒక్కసారిగా పెంచేశాడు. రాజమౌళి, త్రివిక్రమ్ తరువాత అత్యదిక పారితోషికం అందుకుంటున్న దర్శకుల లిస్ట్ లో చేరాడు.
ఆ సినిమాల తరువాత..
జనతా గ్యారేజ్, భరత్ అనే నేను సినిమాలతో సక్సెస్ ఫుల్ దర్శకుడిగా ఒక బ్రాండ్ సెట్ చేసుకున్న కొరటాల అతి తక్కువ కాలంలోనే తన ఆదాయాన్ని 60కోట్లకు పైగా పెంచుకున్నాడు. అయితే ఇక నుంచి రెమ్యునరేషన్ లా కాకుండా లాభాల్లో షేర్స్ ని అందుకోవాలనే డీల్స్ ని మాట్లాడుకుంటున్నట్లు తెలుస్తోంది.
లాభాల్లో వాటాలు..
ప్రస్తుతం కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా విడుదలైన తరువాత బిజినెస్ ని బట్టి వాటా తీసుకోవాలని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్నాడట. అంటే దాదాపు 30కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది.
బన్నీ సినిమాకు కూడా..
ఇక బన్నీతో ఇటీవల కొత్త సినిమాను ఎనౌన్స్ చేసిన కొరటాల అంతకంటే హై రేంజ్ లో లాభాలు అందుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రొడ్యూసర్ తన మిత్రుడే కావడంతో రెమ్యునరేషన్ ఏ మాత్రం తీసుకోకుండా సినిమా రిలీజ్ అనంతరం లాభాల్లో వాటా అడగానున్నాడట.
Recommended Video
క్లిక్కయితే కుబేరుడే..
అల.. వైకుంఠపురములో సినిమాతో బన్నీ ఒక్కసారిగా 200కోట్ల మార్కెట్ ని సెట్ చేసుకున్నాడు. ఇక నెక్స్ట్ సుకుమార్ తో చేస్తున్న సినిమా కూడా పాన్ ఇండియా మూవీ. ఆ తరువాత కొరటాలతో చేసే సినిమా కూడా అదే రేంజ్ లో తెరకెక్కుతుంది. కాబట్టి కొరటాల 50కోట్లకు తక్కువ అందుకోడు అనే కామెంట్స్ వస్తున్నాయి. ప్రీ రిలీజ్ బిజినెస్ అనంతరం తప్పకుండా సినిమా లాభాల్లో ఉంటుందని చెప్పవచ్చు ఇక అప్పటికి ఊహించని లాభాలు వస్తే మరిన్ని షేర్స్ అందుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ప్లాన్ క్లిక్కయితే కొరటాల దర్శకుల జాబితాలో ఒక మినీ కుబేరుడు అయ్యే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.