»   » మహేష్‌ ని పాలిటిక్స్ తో మరిపించి , పవన్ ని సోషల్ ఎవేర్ నెస్ తో పడగొట్టి...

మహేష్‌ ని పాలిటిక్స్ తో మరిపించి , పవన్ ని సోషల్ ఎవేర్ నెస్ తో పడగొట్టి...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఈ రోజు తెలుగులో స్టార్ డైరక్టర్ లలో ఒకరు గా పేరు తెచ్చుకున్నారు కొరటలా శివ. జనతాగ్యారేజ్ తో ఆయన కలం బలంకు , ఆయన దర్శకత్వానికి తిరుగు లేదని తేలిపోయింది. దాంతో ఆయన వరస పెట్టి స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తున్నారు.

రీసెంట్ గా కొరటాల శివ...మహేష్ తో ఓ సినిమా, పవన్ తో మరో సినిమా కమిటయ్యారని సమాచారం. అలాగని అంత పెద్ద స్టార్స్ తో రొటీన్ సినిమాలు చేస్తే ఎలా..అందుకే వారికి తగ్గ కథలు వండుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ దగ్గర కథలకి సంబంధించి ఓ బ్యాంకే ఉంది. పది కథలు సిద్ధం చేసుకొన్నానని ఆయన ఇదివరకే ప్రకటించారు.

అందుతున్న సమాచారం ప్రకారం...మహేష్‌ బాబు - కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కబోతోందన్న సంగతి తెలిసిందే. మురుగదాస్‌ సినిమా పూర్తయ్యాక 'శ్రీమంతుడు' కాంబోలో సినిమా మొదలవుతుంది. ఈ కథా నేపథ్యం రాజకీయాల చుట్టూ తిరగబోతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.

Koratala siva next wit Mahesh and Pawan Kalyan

ఆ సినిమాలో మహేష్‌ ముఖ్యమంత్రి పాత్రలో కనిపిస్తాడని చెప్పుకొంటున్నారు. 'దూకుడు'లో మహేష్‌ ఎమ్‌.ఎల్‌.ఏ పాత్రలో కనిపించాడు కదా? ఇప్పుడు సీఎమ్‌గా ప్రమోషన్‌ వచ్చిందని సరదాగా జోక్స్ వేసుకుంటున్నారు. అప్పుడే అభిమానులు మహేష్ ని సీఎం పాత్రలో ఊహించుకుంటూ ఫొటో షాపులో షేప్స్ దిద్దేసి, సోషల్ మీడియాలో వదిలేస్తున్నారు. 2017 జనవరిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం కొరటాల శివ స్క్రిప్టుని తీర్చిదిద్దే పనిలో ఉన్నారని టాక్‌.

మరో ప్రక్క కొరటాల శివ... ఓ స్టెప్ ముందేకేసి ఓ కథని పవన్‌కల్యాణ్‌ కోసం ముస్తాబవుతున్నట్టు సమాచారం. 'జనతా గ్యారేజ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న కొరటాల ప్రస్తుతం మహేష్‌బాబుతో సినిమాకోసం సన్నద్ధమవుతున్నారు. జనవరిలోనే ఆ చిత్రం పట్టాలెక్కబోతోంది. ఆ తర్వాత పవన్‌తోనే కొరటాల సినిమా చేయబోతున్నారని ప్రచారం సాగుతోంది.

కొరటాల శివ బలమైన సోషల్‌ ఎలిమెంట్స్‌తో కథల్ని సిద్ధం చేసుకొంటుంటారు. ఆ తరహా కథల్లో నటించడం స్వతహాగా పవన్‌కి చాలా ఇష్టం. అందుకే వాళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ఆ కలయిక కుదిరిందంటే అంచనాలు ఆకాశాన్నంటడం ఖాయం అని ట్రేడ్ వర్గాల్లో లెక్కలు వేస్తున్నారు. పవన్ కు సోషల్ ఎవేర్ నెస్ సబ్జెక్ట్ తో తీసుకుని వస్తాడట. అదండీ మ్యాటర్.

English summary
Koratala Siva wants to write a script that would meet the demands and expectations of Pawan Kalyan and his fans. Once he is ready with such a story that he likes he surely knocks the door of Pawan Kalyan.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu