బాలకృష్ణతో మహేష్ బాబు.. దిమ్మ తిరిగి పోయే కాంబో సెట్ చేసిన కొరటాల... ఇక బాక్సాఫీసు లు బద్దలే!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నందమూరి నటసింహం బాలకృష్ణ కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది? బాక్సాఫీసులు బద్దలే.. కదూ! ఈ రేర్ కాంబినేషన్ సెట్ చేయడానికి ఒక టాలీవుడ్ టాప్ డైరెక్టర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. ఆసక్తికరంగా మారిన ఈ గాసిప్ కు సంబంధించిన వివరాల్లోకి వెళితే

అఖండ కోసం వెయిటింగ్
చాలా కాలం నుంచి సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన విడుదల కావడానికి సర్వం సిద్ధమైంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా మీద బాలకృష్ణ అభిమానులు అయితే చాలా అంచనాలు పెట్టుకున్నారు.

మహేష్ కెరీర్లో
మరోపక్క చివరిగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం గీత గోవిందం దర్శకుడు పరుశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా బ్యాంకింగ్ ఫ్రాడ్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా నిజానికి సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ పూర్తి కాకపోవచ్చు అనే అంచనాల నేపథ్యంలో ఏప్రిల్ నెలకు వాయిదా వేశారు.

ఇద్దరినీ కలిపి ఒక సాలిడ్ సినిమా
తాజాగా ఫిల్మ్ నగర్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు బాలకృష్ణ, మహేష్ బాబు కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందని ఈ ఇద్దరినీ కలిపి ఒక సాలిడ్ సినిమా చేయడానికి కొరటాల శివ ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో సినిమాలు వస్తాయని చాలా సార్లు ప్రచారం జరిగింది. కానీ ఒక్కటి కూడా నిజం కాలేదు. కొద్ది రోజుల క్రితం కూడా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ మహేష్ బాబు నటించవచ్చు అంచనాలు వెలువడ్డాయి. కానీ ఏది నిజం కాలేదు.

మహేష్ బాబు - బాలకృష్ణ
మహేష్ బాబు - బాలకృష్ణ -కొరటాల శివ కాంబినేషన్లో గురించి కూడా వార్తలు వెలువడుతున్న నేపధ్యంలో ఆ కాంబినేషన్ లో సినిమా దొరికితే రికార్డులు బద్దలు కావడం ఖాయం అని అంటున్నారు. అయితే ఇందులో నిజానిజాలు ఏమేరకు ఉన్నాయనేది కొరటాల శివ గాని లేదా బాలకృష్ణ మహేష్ బాబు కి సంబంధించిన వ్యక్తులు కానీఅధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

చాలా గ్యాప్
ప్రస్తుతానికి కొరటాల శివ ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. చివరిగా మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమా చేసిన కొరటాల శివ ఆ తర్వాత చిరంజీవి ఆచార్య సినిమా చేయడం కోసం చాలా గ్యాప్ తీసుకున్నారు. అనుకోకుండా కరోనా దేశం లోకి ఎంటర్ కావడంతో ఆచార్య సినిమా అంతకంతకూ లేటవుతుంది వెళ్ళింది. చివరిగా ఆ సినిమాని ఫిబ్రవరి 4వ తేదీన విడుదల చేయడానికి అన్ని సిద్ధం చేస్తున్నారు.

ఆచార్య మిస్
నిజానికి ఆచార్య సినిమాలో కూడా మహేష్ బాబు నటించాల్సి ఉండగా చివరి నిమిషంలో ఆయన నటించలేను అని చెప్పడంతో అదే పాత్రలో రామ్ చరన్ నటింప చేస్తున్నారు. అయితే ముందు ఉన్న పాత్ర కంటే రామ్ చరణ్ హీరోగా మారిన తర్వాత పాత్ర నిడివి పెరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది.


Click it and Unblock the Notifications











