Acharya విషయంలో డిస్టిబ్యూటర్లకు ఊరట.. ఎన్ని కోట్లు వెనక్కి వచ్చాయంటే?
భారీ అంచనాల మధ్య మెగాస్టార్ చిరంజీవి హీరోగా రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. చిరంజీవి , రామ్ చరణ్ కలిసి నటించిన పూర్తి స్థాయి మొట్టమొదటి సినిమా అయినప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను కాదు కదా అభిమానులను మెప్పించడంలో పూర్తి స్దాయిలో విఫలమైంది. ఈ సినిమా వల్ల డిస్ట్రిబ్యూటర్లు భారీగానే నష్టపోయారు. అయితే ఈ క్రమంలో నైజాం రైట్స్ కొన్న వరంగల్ శ్రీను సహా డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ డబ్బు కొంత మేర తిరిగి ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే..

సెటిల్మెంట్
మెగాస్టార్ చిరంజీవి - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా కొరటాల శివ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మెగా అభిమానులను సైతం ఈ సినిమా మెప్పించ లేక పోయింది. ఈ క్రమంలో ఈ సినిమా డిస్ట్రిబ్యూటర్లకు భారీగా నష్టాలు మిగిలాయి. ఈ నేపథ్యంలో సినిమా డైరెక్టర్ కొరటాల శివ తన వంతు బాధ్యతగా డిస్ట్రిబ్యూటర్లకు దగ్గరుండి సెటిల్మెంట్ చేయించారని అంటున్నారు.

అన్నీ తానై
అంతే కాదు ఫైనల్ సెటిల్మెంట్ లో భాగంగా కొరటాల శివ డిస్ట్రిబ్యూటర్లకు 33 కోట్లు తిరిగి ఇచ్చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే ఫారిన్ ట్రిప్ నుంచి తిరిగి హైదరాబాద్ కి వచ్చిన చిరంజీవి కూడా కొరటాల శివని ఈ విషయం మీద కలిసి మాట్లాడినట్టు తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమా డైరక్షన్ వరకే పరిమితం కాకుండా అన్నీ తానై నడిపించారు

ముందు నుంచే
సినిమా బిజినెస్ విషయంలో కూడా కీలక పాత్ర పోషించారని విడుదలకు ముందు నుంచే ప్రచారం జరిగింది. కొణిదెల, మ్యాట్నీ ఎంటర్టైన్‌మెంట్ బ్యానర్లు జస్ట్ పేరు మాత్రమే వేసుకున్నాయని.. లాభనష్టాలు అన్నీ ముందు నుంచే కొరటాల చూసుకున్నారని కూడా టాక్ వచ్చింది. అందులో భాగంగానే ఫైనల్ సెటిల్మెంట్ కూడా ఆయనే చేసారని అంటున్నారు.

20 కోట్ల పైనే
ఈ మేరకు భారీ గా డబ్బు రిటర్న్ ఇచ్చేసారని ఆ మధ్య ప్రచారం జరిగింది. ఈ సినిమా నైజాం రైట్స్ కొన్న వరంగల్ శ్రీనుకు 20 కోట్ల పైనే నష్టం వచ్చింది. దీంతో ఆయనకు కొరటాల 14 కోట్ల దాకా వెనక్కు ఇచ్చారని తెలుస్తోంది. అంతే కాక కొన్ని ఇతర హామీలు కూడా ఇచ్చారని, ఆ మేరకు ఒప్పందాలు జరిగాయని అంటున్నారు.

నష్టాలను భరించి
సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలి పోవడంతో ఒక పక్క దర్శకుడు శివ, మరొక పక్క మెగాస్టార్ చిరంజీవి. - రామ్ చరణ్ అలాగే నిరంజన్ రెడ్డి కూడా నష్టాలను భరించి డబ్బు వెనక్కు ఇచ్చారని తెలుస్తోంది. ఎవరూ ఊహించని విధంగా సినిమా డిజాస్టర్ కావడంతో ఈసారి వచ్చే ప్రాజెక్టులు జాగ్రత్తగా చేయాలని వారు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. కానీ ఒక్క వరంగల్ శ్రీనుకి 14 కోట్ల రూపాయలను చెల్లించారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











