దేవి శ్రీ ప్రసాద్ vs థమన్.. అల్లు అర్జున్ సినిమా కోసం పోటాపోటీగా..

ఏ సినిమా ఇండస్ట్రీలో అయినా సరే కాంబినేషన్స్ కి భారీ స్థాయిలో క్రేజ్ ఉంటుందని చెప్పవచ్చు. ఇక డైరెక్టర్, హీరో కంటే కూడా కొన్నిసార్లు మ్యూజిక్ కంపోజర్స్, డైరెక్టర్ మధ్య కూడా కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అవుతుంది. అయితే అప్పుడప్పుడు ఆ కాంబినేషన్స్ కి ఊహించని విధంగా బ్రేక్ పడుతోంది. ఇక థమన్ దెబ్బకు దేవి శ్రీ ప్రసాద్ అవకాశాలు కూడా చాలా వరకు మిస్ అవుతున్నాయి.

థమన్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది..

థమన్ సౌండ్ ఎక్కువగా వినిపిస్తోంది..


ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా థమన్ సౌండ్ వినిపిస్తోంది. ముఖ్యంగా అల వైకుంఠపురములో సినిమా నుంచి థమన్ క్రేజ్ ఒక్కసారిగా అంచనాలను దాటిపోయింది. దీంతో దేవి శ్రీ ప్రసాద్ చేయాల్సిన కొన్ని సినిమాలు చివరి నిమిషంలో థమన్ చేతుల్లోకి వస్తున్నాయి. ఇక త్వరలో బన్నీ సినిమాను కూడా థమన్ లాగేసుకునే ఛాన్స్ ఉన్నట్లు టాక్ వస్తోంది.

అక్కడే థమన్ రేంజ్ పెరిగింది

అక్కడే థమన్ రేంజ్ పెరిగింది

ఈ ఏడాది మొదట్లో సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీ కెవ్వరు, అల.. వైకుంఠపురములో సినిమాలకు ఈ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్ బాగానే కష్టపడ్డారు. కానీ ఎక్కువగా థమన్ పాటలే క్లిక్కయ్యాయి. ఇక సరిలేరు నీకెవ్వరుతో మాత్రం దేవి శ్రీ ప్రసాద్ సరైన పోటీ ఇవ్వలేకపోయాడు. దీంతో అక్కడే థమన్ రేంజ్ ఎక్కువగా పెరిగిపోయింది.

బన్నీ సినిమా కోసం..

బన్నీ సినిమా కోసం..

ఊహించని విధంగా కొరటాల శివ కూడా దేవి శ్రీ ప్రసాద్ ని ఆచార్య సినిమా కోసం సెలెక్ట్ చేసుకోలేకపోయాడు. ఇక నెక్స్ట్ అల్లు అర్జున్ సినిమా కోసమైనా దేవిని సెలెక్ట్ చేసుకోవాలని కొరటాల గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అంతకంటే ముందు ఈ రాక్ స్టార్ పుష్ప సినిమా ద్వారా బన్నీని మెప్పించే తీరాలి.

Recommended Video

Celebrities Green India Challenge
పట్టు వదలని కొరటాల

పట్టు వదలని కొరటాల


అల.. వైకుంఠపురములో విజయంలో థమన్ పాత్ర చాలానే ఉందని చెప్పాలి. ఒక్కో సాంగ్ యూ ట్యూబ్ లో ఊహించని రికార్డ్స్ అందుకున్నాయి. అందుకే బన్నీ మరోసారి థమన్ తో వర్క్ చేయాలని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నాడు. కానీ కొరటాల మాత్రం దేవిని వదులుకోవడానికి ఇష్టపడటం లేదు. మరి రాక్ స్టార్ బన్నీని ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X