»   » జనతా ఎఫెక్ట్: మహేష్ మూవీకి కొరటాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

జనతా ఎఫెక్ట్: మహేష్ మూవీకి కొరటాల రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సినిమా రంగంలో ఒక సినిమా హిట్టయిన తర్వాత యాక్టర్లు, డైరెక్టర్లు రెమ్యూనరేషన్ భారీగా పెంచడం మామూలే. ఇటీవల 'జనతా గ్యారేజ్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు కొరటాల శివ కూడా తన తర్వాతి సినిమాకు రెమ్యూనరేషన్ భారీగా పెంచేసాడట.

తొలి 8 రోజుల్లోనే రూ. 100 కట్లకు పైగా వసూలు చేసి తెలుగు సినిమా చరిత్రలో 'బాహుబలి' తర్వాత హయ్యెస్ట్ గ్రాసర్ స్థానాన్ని దక్కించుకునే దిశగా 'జనతా గ్యారేజ్' బాక్సాఫీసు రేసులో దూసుకెలుతున్న సంగతి తెలిసిందే.

వరుసగా మూడు సినిమాలతో మంచి ఊపుమీద ఉన్న కొరటాల తన తర్వాతి సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోతున్నాడు. జనతా మూవీకి తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఈ చిత్రానికి రూ. 5 కోట్లు ఎక్కువగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ఎంత తీసుకుంటున్నాడో తెలుసా?

ఫిల్మ్ నగర్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబుతో చేయబోయే తన తర్వాతి చిత్రానికి రూ. 15 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. నిర్మాతలు, హీరోలు అంత మొత్తం ఇచ్చిన ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతుండటం బట్టి కొరటాల శివకు ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

రాజమౌళి తర్వాత అంత భారీ మొత్తం కొరటాలకే

రాజమౌళి తర్వాత అంత భారీ మొత్తం కొరటాలకే

తెలుగు సినీ పరిశ్రమలో రాజమౌళి తర్వాత అంత భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న డైరెక్టర్ కొరటాల శివ మాత్రమే అని అంటున్నారు. కొన్నాళ్లు పోతే హీరోతో సమానంగా డైరెక్టర్స్ రెమ్యూనరేషన్ తీసుకునే రోజులొస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

సినిమా బడ్జెట్

సినిమా బడ్జెట్

కొరటాల శివ రెమ్యూనరేషన్ 15 కోట్లు, మరి మహేష్ బాబుకు ఎంత కాదన్న రూ. 25 నుండి 30 కోట్లు ఉంటుంది. 40 నుండి 45 కోట్లు వీరికే... ఈ లెక్కన సినిమా బడ్జెట్ ఏం రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.

ప్రొడ్యూసర్

ప్రొడ్యూసర్

ప్రస్తుతం మురుగదాస్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. తన తర్వాతి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్నాడు. సీనియర్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తాడు.

శివ స్వయంగా ప్రకటించాడు

శివ స్వయంగా ప్రకటించాడు

ఈ సినిమా 2017 జనవరిలోనే మొదలుకాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా కొరటాల శివనే ప్రకటించాడు. తన కెరీర్లో ఇది మరో ప్రతిష్టాత్మక చిత్రం అని కొరటాల అన్నాడు. కొరటాల-మహేష్ కాంబినేషన్లో ‘శ్రీమంతుడు' లాంటి బ్లాక్ బస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Koratala Siva who is said to be demanding Rs 15 crores for his next film that will star superstar Mahesh Babu is second highest paid director.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu