NTR 30 Leak: నెట్టింట్లో వైరల్ అవుతున్న టైటిల్.. ఎన్టీఆర్ కోసం కొరటాల కసరత్తు!
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా మూవీగా రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు అయితే మామూలుగా లేవు. తప్పకుండా హై రేంజ్ లోనే సినిమా ఉంటుంది అని నందమూరి ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు అయితే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా కొరటాల శివ ఒక నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకు అందరి మదిలో మెదులుతున్న ఒక మాటను టైటిల్ గా సెట్ చేసే ఆలోచనలో ఉన్నారట. ఆ వివరాల్లోకి వెళితే...
భారీ బడ్జెట్: జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో ఇదివరకే జనతా గ్యారేజ్ సినిమా వచ్చింది. అది బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అంతకుమించి అనేలా భారీ బడ్జెట్ తో ఎన్టీఆర్ 30వ సినిమాను తెరపైకి తీసుకురాబోతున్నారు. ఈ ప్రాజెక్టు కోసం దాదాపు 300 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తోంది.

రేంజ్ పెంచేలా క్యాస్టింగ్: ఇక కాస్టింగ్ తో కూడా ఈ సినిమా రేంజ్ ను మరో లెవెల్ కు పెంచాలి అని చూస్తున్నారు. ఇప్పటికే హీరోయిన్ పాత్రకు జాన్వి కపూర్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. అలాగే మరొక సైడ్ హీరోయిన్ పాత్ర కోసం కూడా సెర్చింగ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇక విలన్ పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా కథనాలు వస్తున్నాయి.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్: ఇక ఈ సినిమా కోసం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సంగీతం అందించబోతున్న విషయం తెలిసిందే. మొదట కొంతమంది పేర్లు వినిపించినప్పటికీ ఫైనల్ గా దర్శకుడు అనిరుద్ ని ఫైనల్ చేశారు. అతను కూడా మధ్యలో తప్పుకున్నట్లు కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. కానీ అందులో ఎలాంటి నిజం లేదు అని ఇటీవల సినిమా లాంచ్ వేడుక ద్వారా అర్ధమైపోయింది.

టైటిల్ ఇదేనా..: ఇక ఎన్టీఆర్ 30వ సినిమా కోసం ఎలాంటి టైటిల్ ఫైనల్ చేస్తారనే విషయంలో కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం అయితే సినిమా టైటిల్ విషయంలో కొరటాల శివ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న 'వస్తున్నా' అనే సింగిల్ లైన్ పదాన్ని తీసుకుని టైటిల్ గా ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారట. ఈ టైటిల్ను ఇదివరకే ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్లో హైలెట్ చేసిన విషయం తెలిసిందే.
అలా ఉంటే బెటర్: వస్తున్నా అనే పదం ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో బాగా వైరల్ అయింది. ఇటీవల జూనియర్ ఎన్టీఆర్ బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పినప్పుడు కూడా అతను 'వస్తున్నా' అనే పదాన్ని వాడడంతో బాగా హైలైట్ అయింది. దీంతో అదే టైటిల్ అయ్యి ఉండవచ్చు అని అంటున్నారు. కానీ పాన్ ఇండియా రేంజ్ కు తగ్గట్టుగా ఉండాలి అంటే అన్ని భాషలకు సెట్ అయ్యే విధంగా ఓకే టైటిల్ ఉంటే బెటర్ అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. RRR, KGF తరహాలో ఉండాలనే సూచనలు కూడా వస్తున్నాయి. ఇక మళ్లీ తెలుగులో ఒక టైటిల్ మిగతా భాషల్లో మరొక టైటిల్ ఉండేలా చూసుకుంటే అంతగా కిక్ ఉండదు అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఏ విధంగా ఆలోచిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











