ఆచార్య కోసం కొరటాల శివ మరో షాకింగ్ నిర్ణయం!
ఆచార్య సినిమాపై అంచనాలు రోజురోజుకు అమితంగా పెరిగిపోతున్నాయి. సినిమాలో రామ్ చరణ్ ఒక ముఖ్యమైన పాత్రలో మెగాస్టార్ తో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న విషయం తెలిసిందే. ఎదో 30 నిమిషాల గెస్ట్ రోల్ అనుకున్నప్పటికి మెగాస్టార్ సలహాలు మేరకు కొరటాల కథలో మార్పులు చేయలేక తప్పలేదట. రామ్ చరణ్ సిద్దా అనే స్టూడెంట్ యూనియన్ లీడర్ గా కనిపించబోతున్నాడు.
ఇక చరణ్ సెకండ్ హాఫ్ మొత్తం కనిపిస్తాడని తెలుస్తోంది. దాదాపు సినిమాలో గంటకు పైగా ఉంటాడట. ఇక దీన్ని మల్టీస్టారర్ అనకుండా ఉండలేకపోతున్నారు అభిమానులు. దర్శకుడు కొరటాల చరణ్ కోసం ఇప్పటికే చాలా మార్పులు చేశాడు. అసలు మ్యాటర్ లోకి వస్తే సినిమాకు సంబంధించిన లీక్స్ దర్శకుడికి పెద్ద తలనొప్పిగా మారింది. ఎంత రహస్యంగా ఉన్నా కూడా ఏదో ఒక ఫొటో లీక్ అవుతూనే ఉంది.

ప్రస్తుతం మెగాస్టార్, రామ్ చరణ్ లపై ఒక సాంగ్ ను షూట్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సాంగ్ కు సంబంధించిన ఫొటోస్ ఇప్పటికే రెండు లీక్ అయ్యాయి. దీంతో కొరటాల ఆ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సినిమాకు సెక్యూరిటీ భారీ స్థాయిలో పెంచారట. ఇక నుంచి ఎవరు కూడా ఫోన్లు సెట్స్ లో వాడకుండా ఉండేలా చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి కొరటాల ప్లాన్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











