ఇండస్ట్రీలో జరిగే మోసాలపై కొరటాల న్యూ ప్రాజెక్ట్.. బోయపాటి కొట్టిన దెబ్బను గుర్తు చేస్తాడా?

సినిమా ప్రపంచంలో స్వచ్ఛమైన మనుషుల కన్నా కూడా పరిస్థితులను బట్టి రంగులు మార్చేవాళ్లే ఎక్కువగా ఉంటారు. అలాంటి వారు స్వార్థం వల్ల చేసే తప్పులకు చాలా మంది కెరీర్ ఉన్నతస్థాయికి ఎదగడం లేదని చాలా మంది చెబుతుంటారు. ఇక మోసాలపై ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే ఇండస్ట్రీలో జరిగే కొన్ని చీకటి మోసాలను అందరికి తెలిసేలా చేయాలని దర్శకుడు కొరటాల ఒక ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

ఆహా యాప్ లో వెబ్ సిరీస్..

ఆహా యాప్ లో వెబ్ సిరీస్..

త్వరలోనే కొరటాల సొంత ప్రొడక్షన్ ని స్థాపించి అందులోనే కొత్త దర్శకులకు సినిమా అవకాశాలను ఇవ్వాలని అనుకుంటున్నాడు. ఇక ముందుగా ఆహా యాప్ లో ఒక వెబ్ సిరీస్ ని ప్లాన్ చేస్తూనట్లుగా టాక్ వస్తోంది. సొంతంగా కథను రాసిన కొరటాల అందులో వివిధ సామాజిక అంశాలతో పాటు ఇండస్ట్రీలో సినిమా కష్టాల గురించి మోసాల గురించి ఎక్కువగా చూపించనున్నట్లు తెలుస్తోంది.

దీలింగ్ కూడా సెట్టయ్యింది..

దీలింగ్ కూడా సెట్టయ్యింది..

గత కొంత కాలంగా తన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉంటున్న కిరణ్ అనే కుర్రాడికి మెగా ఫోన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఆహా యాప్ తో ఇటీవల డీలింగ్స్ కూడా మాట్లాడుకున్నట్లు టాక్ వస్తోంది. దాదాపు డీల్ క్లోజ్ అయ్యిందట. త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని కొరటాల టీమ్ ప్లాన్ చేసుకుంటోంది.

బోయపాటితో జరిగిన గొడవపై..

బోయపాటితో జరిగిన గొడవపై..

ఇక అసలైన కాంట్రవర్సీ విషయనికి వస్తే.. కొరటాల రాసుకున్న వెబ్ సిరీస్ లో ఆయనకు సినిమా ఇండస్ట్రీలో ఎదురైన చేదు అనుభవాలను ఎక్కువగా చూపించనున్నారు అనే టాక్ వస్తోంది. ముఖ్యంగా బోయపాటి శ్రీనివాస్ తో జరిగిన వివాదం గురించి కూడా వెబ్ సిరీస్ లో ఉంటుందనే రూమర్స్ వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియది గాని గతంలో అయితే బోయపాటికి, కొరటాలకి ఒక సినిమా విషయంలో గొడవ జరిగింది.

అప్పుడే క్లారిటీ ఇచ్చిన కొరటాల

అప్పుడే క్లారిటీ ఇచ్చిన కొరటాల

కొరటాల శివ సింహా సినిమాకి వర్క్ చేశారు అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఆ సినిమా టైటిల్ కార్డ్ లో కొరటాల పేరు ఉండదు. కథ, మాటలు రెండు కూడా తనవే అని ఒక ఇంటర్వ్యూలో కొరటాల శివ వివరణ కూడా ఇచ్చారు. అయితే ఆ విషయాన్ని గురించి ఎక్కువగా మాట్లాడటం తనకు ఏ మాత్రం ఇష్టం లేదని, కానీ ఆ విషయం తనకి చాలా బాధను కలిగించిందని కొరటాల తెలిపాడు.

Recommended Video

Green India Challenge : Director Srinu Vaitla Takes Up Green India-Challenge & Nominated Sonu Sood
ఆ మోసాన్ని కూడా చూపిస్తాడా..?

ఆ మోసాన్ని కూడా చూపిస్తాడా..?

ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని అలా జరగకపోయి ఉంటే తాను ఇంకా తొందరగా పైకొచ్చేవాడినేమోనని కూడా కొరటాల వివరణ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే ఇపుడు సినిమా ఇండస్ట్రీలో జరిగే మోసాలపై కొరటాల స్పెషల్ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తుండడంతో బోయపాటిని టార్గెట్ చేశారా అనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X