నాని vs విజయ్ దేవరకొండ.. ఆ స్టార్ డైరెక్టర్ కోసం బిగ్ ఫైట్?
టాలీవుడ్ లో ఎలాంటి సపోర్ట్ లేకుండా స్టార్ హీరోలుగా ఎదిగిన నాని, విజయ్ దేవరకొండ ఎలాంటి క్రేజ్ ని అందుకున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. కెరీర్ మొదటి నుంచి ప్రస్తుత జనరేషన్ ని ఆకట్టుకునే విధంగా ఎవరి స్టైల్లో వారు కష్టపడి స్టార్ హీరోల రేంజ్ లో వారికంటూ ఒక మార్కెట్ ని సెట్ చేసుకున్నారు. జయపజయలతో సంబంధం లేకుండా కొనసాగుతున్న ఈ స్టార్స్ ఇప్పుడు పెద్ద దర్శకులతో వర్క్ చేయడానిక్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

కొరటాల కొత్త కథలు..
అపజయం లేని దర్శకుడు కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా తరువాత కొరటాల శివ నేటితరం యంగ్ హీరోలతో వర్క్ చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని కథలను రెడీ చేసుకున్న దర్శకుడు ఆచార్య అనంతరం కమర్షియల్ గా కాకుండా నేటి యువతరానికి నచ్చేలా రొమాంటిక్ అండ్ ఎమోషనల్ కథను ప్లాన్ చేస్తున్నారట. ఆ కొత్త కథల కోసం హీరోలను వెతుకుతున్నట్లు తెలుస్తోంది.

నాని vs విజయ్ దేవరకొండ..
డైరెక్టర్ కొరటాల శివతో సినిమా అంటే ఎలాంటి హీరోలైనా సిద్ధంగా ఉంటారు. ఇక ప్రస్తుతం ఆ దర్శకుడి కన్ను నాని, విజయ్ దేవరకొండలపై పడ్డట్లు తెలుస్తోంది. కొరటాల తన నెక్స్ట్ సినిమాలో ఈ ఇద్దరి హీరోల్లో ఎవరినో ఒకరినే సెలక్ట్ చేసే అవకాశం ఉందట. ఈ కాంబినేషన్ పై ప్రస్తుతం ఇండస్ట్రీలో అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. కొరటాల సినిమాలో నటించే హీరో ఎవరనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.
Recommended Video

మల్టీస్టారర్ కాదట..
కొరటాల శివ కూడా మల్టీస్టారర్ సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు ఆ మధ్య కొన్ని రూమర్స్ వచ్చాయి. ఆచార్య సినిమా అనంతరం ఇద్దరి హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించే ఛాన్స్ ఉందని కథనాలు వెలువడ్డాయి. అయితే ప్రస్తుతం కొరటాల మాత్రం అలాంటి ప్లాన్ లో అయితే లేడని తెలుస్తోంది. అయితే విజయ్ దేవరకొండ లేదా నానితో ఒక సినిమా చేసే ఛాన్స్ ఉన్నట్లు టాక్ అయితే నడుస్తోంది.

ఆచార్య తరువాతే ఏదైనా..
లాక్ డౌన్ లో ప్రస్తుతం కొత్త తరహా కథలకు పదును పెడుతున్న కొరటాల శివ ఒకవేళ పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైనా కూడా ఆచార్య తరువాత ఎనౌన్స్ చేస్తారట. కెరీర్ మొదటి నుంచి కూడా ఈ స్టార్ దర్శకుడు ఒక సినిమా అయిపోయిన తరువాతే మరొక సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా అదే తరహాలో వెళ్లాలని అనుకుంటున్నాడు. మరి మెగాస్టార్ తో హిట్టుకొట్టిన తరువాత శివ ఎవరితో వర్క్ చేస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











