కొరటాల లిస్ట్‌లో RRR హీరోలు.. బన్నీ తరువాత అతనితోనే?
అపజయం లేని దర్శకుడిగా కొనసాగుతున్న కొరటాల శివకు లాక్ డౌన్ కొంత బ్రేక్ వేసిందనే చెప్పాలి. ప్రస్తుతం ఈ దర్శకుడు మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే షూటింగ్ వేగాన్ని పెంచుతున్న తరుణంలో కరోనా వైరస్ వచ్చి అడ్డుపడింది. అయితే మరో విధంగా కొరటాలకు ఈ గ్యాప్ బాగానే కలిసొచ్చింది. ముఖ్యంగా భవిష్యత్తు ప్రాజెక్టులను సెట్ చేసుకోవడానికి ఒక స్పెషల్ ప్లాన్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల అల్లు అర్జున్ ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నట్లు అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కుతున్న ఆ సినిమాలో అల్లు అర్జున్ ఒక యువ రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడని టాక్. అసలు మ్యాటర్ లోకి వస్తే.. బన్నీ ప్రాజెక్టు అనంతరం కూడా ముందుగానే ఒక హీరోను రెడీగా ఉంచుకోవాలని కొరటాల కొత్త లిస్ట్ రెడీ చేశాడట.

అందులో RRR హీరోలు ఇద్దరు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ముందుగా జూనియర్ ఎన్టీఆర్ తోనే వర్క్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసలైతే ఆచార్య అనంతరం తారక్ తో చేయాల్సింది. కానీ అతను బిజీగా ఉండడం వల్ల 2021లోనే ప్రాజెక్టును సెట్స్ పైకి తెచ్చే ఆలోచనలో ఉన్నట్లు టాక్. ఇక గతంలో కొరటాల శివ మెగా పవర్ స్టార్ తో ఒక ప్రాజెక్టును ఎనౌన్స్ చేసి క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చరణ్ కోసం కూడా ఒక మంచి యాక్షన్ సినిమాను కథను రెడీ చేస్తున్నాడట. మరి కొరటాల వేసుకున్న ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











