ప్రభాస్ సలార్ 2 లో కొరియన్ సూపర్ స్టార్.. క్లారిటీ వచ్చేసినట్లేనా..?
Prabhas: ఫ్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్కి, సలార్ వంటి సినిమాలు భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలువడంతో ఫ్యాన్ బేస్ మరింత పెరిగింది. అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తాజాగా మరో మూడు ఫాన్ ఇండియా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు డార్లింగ్ ప్రభాస్. ఈ తరుణంలో ఓ సౌత్ కొరియన్ సూపర్ స్టార్ సోషల్ మీడియాలో మన బహుబలి ప్రభాస్ ఫోటోను షేర్ చేయడం చర్చనీయంగా మారింది. ఇంతకీ ఆ కొరియన్ స్టార్ ఎవరు? సోషల్ మీడియాలో ప్రభాస్ పోస్టర్ పోస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? అనే వివరాల్లోకెళ్తే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియ హిట్లతో పుల్ జోష్ లో ఉన్నారు. ఆ ఉత్సాహంతో వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీగా మారారు. ప్రస్తుతం డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్న లవ్ స్టోరీ 'రాజా సాబ్'షూటింగ్ లో ఉంటారు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పూర్తి అవుతోంది. ఈ మూవీ తరువాత హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న 'ఫౌజీ'సినిమాలో భాగం కానున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలు పూర్తి అయినా తరువాత డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తో స్పిరిట్'(Spirit)మూవీలో నటించనున్నారు.

స్పిరిట్ మూవీ వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ .. బడా సంస్థతో భారీ డీల్ చేసుకున్నారు. కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార, సలార్ వంటి పాన్ ఇండియా మూవీలను నిర్మించిన సంస్థ హోంబాలే ఫిల్మీమ్ (Homable Films)తో ప్రభాస్ భారీ ఒప్పందం కుర్చుకున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు భారీ బడ్జెట్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
అసలు ప్రభాస్ ప్లానింగ్ ఏంటి? ఎవరికి అర్థం కావడం లేదు. ఈ తరుణంలో కొరియన్ స్టార్ యాక్టర్ డాన్ లీ.. ప్రభాస్ ఫోటోను తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ వేదికగా సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఇంట్రెస్టింగ్ పోస్ట్ ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ సంబురపడిపోతున్నారు. ఎందుకంటే.. సౌత్ కొరియన్ స్టార్ హీరో డాన్లీ ని.. సందీప్ వంగా తెరకెక్కిస్తున్న ' స్పిరిట్' సినిమాలో విలన్ గా తీసుకోవాలని భావించారట. కానీ, ఆయన నుండి ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో మూవీ మేకర్స్ కూడా సైలెంట్ అయిపోయారట.

అయితే.. ప్రభాస్ ఫోటోను డాన్ లీ షేర్ చేయడంతో వీరిద్దరి కాంబోలో ఓ మూవీ రాబోతుందని, అందుకు కన్ఫర్మేషన్ గానే ప్రభాస్ ఫోటోను షేర్ చేసి ఉంటారని అభిమానులు భావిస్తున్నారు. అయితే..సలార్ లోని ప్రభాస్ ఫోటోను షేర్ చేయడంతో.. ప్రభాస్ అప్ కమింగ్ మూవీ సలార్ 2 లో నటించబోతున్నట్లు, అందుకు కన్ఫర్మేషన్ గా ఈ ఫోటోను షేర్ చేశారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఏ ప్రకటన వస్తుందో వేచి చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











