‘కొత్త జంట’ కు కోత మొదలైంది

By Srikanya

హైదరాబాద్ : ఎంతో కాలం కష్టపడి,కలగన్న సినిమాకు కోత పెట్టడమంటే దర్శకుడుకి గుండె కోత లాంటిదే. కానీ రిజల్ట్ దారుణంగా ఉన్నప్పుడు నష్ట నివారణ చర్యలు మొదలవుతాయి. అందులో భాగమే సినిమా లెంగ్త్ కి కోత పెట్టడం. ఇప్పుడు అదే పరిస్ధితిని అల్లు శిరీష్ తాజా చిత్రం కొత్త జంట ఎదుర్కొంటోంది. ఈ చిత్రం గురువారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకుంది. అంతేకాక చాలా మంది ఈ చిత్రం లో కొన్ని అనవసరమైన సన్నివేశాలు ఉన్నట్లు భావించారు. రివ్యూలలోనూ అదే వ్యక్తం అయ్యింది. దాంతో ఈ చిత్రానికి కోత పెట్టడానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.

సెకండాఫ్ లో దాదాపు పదిహేను నిముషాల పాటు ఈ చిత్రంలో రిపీట్ అనిపించిన సన్నివేశాలు కట్ చేయనున్నారు. ఐటం సాంగ్ తర్వాత వచ్చే సీన్స్ పై ఈ వేటు పడనుంది. సోమవారం నుంచి ఈ కట్ అయిన వెర్షన్ థియోటర్లలలో ప్రదర్శింపబడుతుంది. అయితే ఇలా రిలీజైన తెల్లారి కట్ అయిన సినిమాలు ఏవీ ఇప్పటివరకూ పికప్ కాలేదు. మరి ఈ కొత్త జంటకు ఈ కోత కార్యక్రమం ఎంతవరకూ ప్రయోజనాన్ని ఇస్తుందో చూడాలంటున్నారు.

Kotha Janta To be Trimmed!!!

అల్లు అరవింద్ కుమారుడు, అల్లు అర్జున్ సోదరుడు శిరీష్, రెజినాలు జంటగా హ్యాట్రిక దర్శకుడు మారుతి దర్శకత్వంలో గీతాఆర్ట్స్ బ్యానర్లో నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో ప్రొడ్యూసర్ బన్నీ వాసు నిర్మించిన చిత్రం 'కొత్త జంట'. U/A సర్టిఫికెట్ సొంతం చేసుకున్న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా మే 1న విడుదల అయ్యింది.

దర్శకుడు మారుతి మాట్లాడుతూ...'శిరీష్ బాడీ లాంగ్వేజ్ కి సరిపోయే కథ. పక్కా ఫ్యామిలీ ఎంటర్టెనర్. లవ్, ఎమోషన్, కామెడీ కలగలిపిన ఫ్యామిలీ ఎంటర్టెనర్ అని ధైర్యంగా చెబుతున్నాను. శిరీష్, రెజీనా మధ్య వచ్చే సీన్స్ అందరికీ ఆకట్టుకుంటాయి. నా గత చిత్రం ప్రేమ కథా చిత్రమ్ కంటే రెండింతలు కామెడీ ఉంటుంది. ' అన్నారు.

నటీనటుల: అల్లు శిరీష్, రెజీనా, మధురిమ, పోసాని కృష్ణ మురళి, ఆహుతి ప్రసాద్, రావు రమేష్, రోహిణి, సప్తగిరి, ప్రవీణ్, జోష్ రవి, మధు, సాయి పంపనా, ఏలూరు శీను తదితరులు. సంగీతం: జేబి, ఎడిటింగ్: ఉద్ధవ్, ఆర్ట్: రమణ, యాక్షన్: విజయ్, డాన్స్: గణేష్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.కె.ఎన్, పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను, సమర్పణ: అల్లు అరవింద్, సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్, నిర్మాత్: బన్నీ వాసు, కథ-మాటలు-స్ర్కీన్ ప్లే- దర్శకత్వం: మారుతి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X