మాటీవీ ఆఫీసులో..అల్లు శిరీష్ హంగామా

By Srikanya

హైదరాబాద్ : అల్లు శిరీష్ ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటూంటారు. ఆయన తాజాగా మాటీవి ఆఫీసుకు వచ్చారు. అయితే కొత్త జంట చిత్రం షూటింగ్ పనిమీద. చిత్రం కథలో భాగంగా ఈ సినిమాలో అల్లు శిరీష్ ఓ టీవి ఛానెల్ లో జాబ్ చేస్తూంటాడు. హీరో,హీరోయిన్సా పై అందుకు సంభందించిన సన్నివేశాలని మా టీవీ ఆఫీసులో చిత్రీకరించారు. ఉదయం నుంచి సాయింత్రం వరకూ ఈ షూటింగ్ జరిగింది. ఈ సీన్స్ సినిమాలో కీలకమైనవి అని చెప్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మారుతి డైరక్ట్ చేస్తున్నారు.

రాధామోహన్ దర్శకత్వంలో ప్రకాష్‌రాజ్ నిర్మించిన 'గౌరవం' సినిమాతో అల్లు శిరీష్ హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత శిరీష్ 'కొత్త జంట' ప్రేమకథా చిత్రంలో నటించబోతున్నాడు. ఈరోజుల్లో, బస్టాప్ చిత్రాల ఫేమ్ మారుతి దర్శకుడు. గీతా అర్ట్స్ పతాకంపై బన్నీవాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని ఆ మధ్య విడుదల చేసారు. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ చిత్రంలో అల్లు శిరీష్‌కు జోడీగా ఈ చిత్రంలో 'రొటీన్ లవ్‌స్టోరీ' ఫేమ్ రెజీనాను ఎంపిక చేశారు. విభిన్నమైన ప్రేమకథా చిత్రంగా త్వరలోనే సెట్స్‌పైకి రానున్నదని సమాచారం. ఈ చిత్రానికి గ్రేట్ పీపుల్ ఆర్ సెల్ఫిష్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.

దర్శకుడు మాట్లాడుతూ ''శిరీష్‌ హావభావాలకు తగిన కథ ఇది. ప్రతి సన్నివేశం కడుపుబ్బా నవ్విస్తుంది. కొత్తజంటగా శిరీష్‌, రెజీనా ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తారు. నా మూడో చిత్రమే గీతా ఆర్ట్స్‌ సంస్థలో చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది''అన్నారు. ''చాలా మంచి కథ ఇది. శిరీష్‌ని తెరపై కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు మారుతి. ఇంటిల్లిపాదినీ అలరించేలా ఉంటుందీ చిత్రం'' అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రిచర్డ్‌ ప్రసాద్‌.

యూత్ కామెడీ రెడీ చేసిన స్క్ర్రిప్ట్ ని మారుతి వినిపిస్తే వెంటనే అల్లు అరవింద్ ఓకే చేసినట్లు వినపడుతోంది. అయితే మారుతి..గత చిత్రాలలో బూతు బాగా దిట్టించి వదలటం వల్లనే హిట్ సాధించారనే విమర్శ ఉంది. ఈ చిత్రంతో అయినా రెగ్యులర్ రూట్ లోకి వచ్చి క్లీన్ చిత్రాన్ని అందిస్తాడని అంటున్నారు. ఈ చిత్రంలో అల్లు శిరీష్ సరసన రెజీనా హీరోయిన్ గా చేస్తోంది. 'గౌరవం' విషయానికి వస్తే...ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ నిర్మాతగా రాధామోహన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో నిర్మించిన చిత్రం 'గౌరవం'. ఈ చిత్రం శ్రీ రామనవమి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన విధంగా విజయం సాధించలేదు. పరువు హత్యల బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం తమిళ,తెలుగు భాషల్లోనూ వర్కవుట్ కాలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X