Don't Miss!
- Sports సారీ బ్రదర్.. కావాలని కొట్టలేదు - పంత్ ఎమోషనల్ Video
- Finance Nestle India: అదిరిపోయే లాభాలు ప్రకటించిన నెస్లే ఇండియా..
- News రాయలసీమలో టీడీపీకి బిగ్ షాక్ .. వైసీపీలోకి కీలక నేత
- Technology Infinix GT 20 Pro 5G డిజైన్ రెండర్లు లీక్ అయ్యాయి! స్పెసిఫికేషన్ల వివరాలు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
క్రాక్ దర్శకుడు మెగాఫ్యామిలీని వదిలేలా లేడు.. ఆ కాంబో సెట్టయినట్లే?
క్రాక్ దర్శకుడు గోపిచంద్ మలినేని చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. మొదట కెమెరామెన్ అవ్వాలని అనుకున్న గోపి అనంతరం ఈవివి సత్యనారాయణ, శ్రీను వైట్ల వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా వర్క్ చేశాడు. ఇక ఇన్నాళ్లకు మనోడు బాక్సాఫీస్ వద్ద అసలైన హిట్టు కొట్టాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద 50కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.
గోపీచంద్ మలినేని స్టాలిన్ సినిమాకు కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. అందువల్ల మెగాస్టార్ కు కాస్త క్లోజ్ అయ్యాడు. ఇటీవల క్రాక్ హిట్టు పడగానే మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చిన విషయం తెలిసిందే. అయితే అప్పుడే వీరి మధ్య కొత్త ప్రాజెక్ట్ కు సంబంధించిన చర్చలు జరిగినట్లు సమాచారం. ఏ దర్శకుడికికైనా సరే మెగాస్టార్ ను ఒక్కసారైనా డైరెక్ట్ చేయాలని ఆశగా ఉంటుంది.
ఇక ఆయనే పిలిచి మరీ అవకాశం ఇచ్చాడు అంటే అది మామూలుగా ఉండదు. గోపీచంద్ మలినేనికి ప్రస్తుతం డిమాండ్ గట్టిగానే పెరిగింది.. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆఫర్ వచ్చినట్లు టాక్. బాలకృష్ణ వాళ్ళు ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారు గాని అది సెట్టయ్యేలా లేదని మరొక టాక్ వస్తోంది.
ఇక మళ్ళీ గోపీచంద్ మెగాస్టార్ వైవు యూ టర్న్ తీసుకునేలా ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కానీ మెగాస్టార్ ఇప్పట్లో అయితే ఖాళీగా ఉండరు కాబట్టి ఈ దర్శకుడు ముందే మరో సినిమాను పూర్తి చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.