క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
సినిమా ఇండస్ట్రీలో కెరీర్ యూ టర్న్ తీసుకోవాలి అంటే దర్శకులకు మొదట్లోనే పవర్ఫుల్ హిట్టు పడాల్సిందే. కమర్షియల్ హంగులను కోరుకునే హీరోల ఆలోచనలకు తగ్గట్లు కథను రెడీ చేయాలి అంటే అంత సాధారణమైన విషయం కాదు. ఇక ఇటీవల క్రాక్ హిట్టుతో దర్శకుడు గోపిచంద్ తన అసలైన మాస్ యాక్షన్ మూవీని చాలా పవర్ఫుల్ గా చూపించాడు. ఈ దర్శకుడికి భారీ స్థాయిలో రెస్పాన్స్ దక్కుతోంది.
Recommended Video

అసిస్టెంట్ డైరెక్టర్ గా..
గోపిచంద్ మలినేని చాలా కాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు. మొదట కెమెరామెన్ అవ్వాలని అనుకున్న గోపి అనంతరం ఈవివి సత్యనారాయణ, శ్రీను వైట్ల వంటి వారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేశాడు. స్టాలిన్ సినిమాకు కూడా అసిస్టెంట్ దర్శకుడిగా వర్క్ చేశాడు. వెంకీ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేయడం వల్లనే రవితేజ క్లోజ్ అయ్యాడు.

రవితేజతో రెండు హిట్లు
రవితేజతో మొదట అతను చేసిన సినిమా డాన్ శీను. ఆ సినిమా కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద మంచి లాభాలను అంధించింది. అనంతరం వెంకటేష్ తో బాలీవుడ్ బాడీగార్డ్ సినిమాను రీమేక్ చేశాడు. ఆ సినిమా డిజాస్టర్ అయినప్పటికీ ఆ తరువాత బలుపు సినిమాతో మరో కమర్షియల్ హిట్టు కొట్టాడు.

5 ఏళ్ల తరువాత క్రాక్ సినిమాతో..
ఇక పండగ చేస్కో, విన్నర్ వంటి సినిమాలతో హైప్ బాగానే క్రియేట్ చేసినప్పటికీ అనుకున్నంత రేంజ్ లో క్లిక్కవ్వలేకపోయాడు. 2017లో విన్నర్ తరువాత మరో సినిమా కోసం చాలా కాలం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా రబితేజను క్రాక్ కథతో మెప్పించి బాక్సాఫీస్ హిట్ కొట్టాడు. ఈ సినిమాకు గోపిచంద్ మలినేని పెద్దగా రెమ్యునరేషన్ ఏమి తీసుకోలేదట. హిట్ అయిన తరువాత ఒప్పందం ప్రకారం షేర్స్ ఇచ్చారని సమాచారం.

గోపిచంద్ మలినేనికి.. వచ్చిన లాభం ఎంత
క్రాక్ సినిమా ద్వారా గోపిచంద్ మలినేనికి 2కోట్లకు పైగా ఆదాయం వస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. బాక్సాఫీస్ వద్ద లాభాలు ఇంకా ఎక్కువగా వస్తే ఆ రేటు మరింత ఎక్కువవుతుందట. రవితేజ కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా రెండే ఏరియాల హక్కులను తీసుకొని లాభాలు అందుకుంటున్నాడు.

రాబోయే సినిమాల.. రెమ్యునరేషన్?
ఇక గోపీచంద్ మలినేనికి ప్రస్తుతం డిమాండ్ గట్టిగానే పెరిగింది. అతనికి భారీ స్థాయిలో ఆఫర్స్ వస్తున్నాయి. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి ఆఫర్ వచ్చినట్లు టాక్. హీరో ఎవరనే విషయం తెలియదు గాని బడ్జెట్ విషయంలో హద్దులు లేకుండా మంచి మాస్ మసాలా సినిమాను రెడీ చేసి ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే మరో బిగ్ ప్రొడక్షన్ తో కూడా చర్చలు జరిపినట్లు సమాచారం. ఇక రెమ్యునరేషన్ 4 నుంచి 5కోట్లకు పైగానే అందుకునే అవకాశం ఉందట. మరి గోపిచంద్ మలినేని నెక్స్ట్ ఎలాంటి సినిమాతో వస్తాడో చూడాలి.


Click it and Unblock the Notifications











