బాలీవుడ్ సినిమా తరువాత మెగాహీరోతోనే.. క్రాక్ దర్శకుడు ప్లానింగ్ మామూలుగా లేదు
చాలా రోజుల తరువాత టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఒక సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన సినిమా క్రాక్. నిజంగా సినిమా ఇండస్ట్రీలో క్రాక్ విజయాన్ని ఎవరు అంత ఈజీగా మర్చిపోలేరు. లాక్ డౌన్ తరువాత ఎన్నో అనుమానాల మధ్య విడుదలైనప్పటికి కలెక్షన్స్ విషయంలో తేడా కొట్టలేదు. ఇక ప్రస్తుతం ఆ సినిమా డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి డిమాండ్ కూడా పెరిగింది.

రవితేజ కెరీర్ బెస్ట్ హిట్
క్రాక్ సినిమాకు మొదటిరోజే మాస్ రాజా అభిమానుల నుంచి హై వోల్టేజ్ టాక్ వచ్చేసింది. అక్కడి నుంచి ఏ మాత్రం తగ్గకుండా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటూ రవితేజ కెరీర్ లోనే బెస్ట్ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా నిలిచింది. ఇక సినిమా పెద్దలు కూడా డైరెక్టర్ గోపిచంద్ మలినేనిపై ప్రశంసలు కురిపించారు.

మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లే
ఇండస్ట్రీలో అగ్ర హీరోల దృష్టి మొత్తం ఇప్పుడు గోపిచంద్ పైనే ఉంది. గత 15 ఏళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటున్న ఈ దర్శకుడు అందరి హీరోలకు సుపరిచితమే. అయితే హిట్ టాక్ రాగానే మెగాస్టార్ నుంచి గోపిచంద్ పిలుపు అందుకున్న విషయం తెలిసిందే. ఇద్దరి మధ్య చాలా సేపు చర్చ జరిగింది. మెగాస్టార్ కూడా మంచి కథ ఉంటే చూడమని అప్పుడే చెప్పారట.

అడ్వాన్స్ కూడా ఇచ్చేశారు
ఇక గోపిచంద్ మలినేని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నుంచి అడ్వాన్స్ కూడా అందినట్లు తెలుస్తోంది. బాలకృష్ణతో సినిమా చేయడానికి చర్చకు జరుగుతున్నట్లు గోపీచంద్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు. అయితే ఆ సినిమా అనంతరం తమకు సినిమా చేయాలని చాలా మంది నిర్మాతలు అడ్వాన్స్ లు ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు టాక్.
Recommended Video

ఈ కాంబోలో సినిమా వచ్చేది ఎప్పుడంటే..
ఇక బాలీవుడ్ లో కూడా క్రాక్ సినిమాను రీమేక్ చేయమని ఆఫర్స్ చాలానే వస్తున్నాయట. బాలయ్యతో ప్రాజెక్ట్ సెట్టయితే బాలీవుడ్ క్రాక్ పై కూడా ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇక ఫైనల్ గా మెగాస్టార్ తో కూడా ఇప్పుడే ఒక కమిట్మెంట్ తీసుకోవాలని అనుకుంటున్నారట. గోపిచంద్ రెండు సినిమాలు పూర్తి చేసేలోపు మెగాస్టార్ లైన్ లో ఉన్న మూడు సినిమాలను రిలీజ్ చేస్తాడట. ఇక వీరి కాంబినేషన్ లో 2023లో తప్పకుండా సినిమా వచ్చే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











