పవన్ కోసం ఇంజనీర్‌గా మారిన డైరెక్టర్.. పవర్ స్టార్ టార్గెట్ మిస్ కాకుండా ప్లాన్.!

By Manoj

కొద్ది రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోన్న అంశాల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీఎంట్రీ ఒకటి. చాలా కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన... మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంటుండడంతో అందరి దృష్టి అటువైపే పడింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా తన అభిమానుల కోసం దూడుకును ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కల్యాణ్ పెట్టుకున్న ఓ టార్గెట్ మిస్ అవకూడదని... ఓ డైరెక్టర్ ఇంజనీర్‌గా మారిపోయాడు. ఇంతకీ ఎవరా డైరెక్టర్.? పవర్ స్టార్‌ కోసం ఏం చేస్తున్నాడు.? పూర్తి వివరాల్లోకి వెళితే...

వకీల్ సాబ్‌గా పవన్.. రెస్పాన్స్ అదిరింది

వకీల్ సాబ్‌గా పవన్.. రెస్పాన్స్ అదిరింది

సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కల్యాణ్.. ‘వకీల్ సాబ్' అనే సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా.. ‘పింక్' అనే హిందీ చిత్రానికి రీమేక్‌గా వస్తోంది. వ్యభిచార గృహంలో చిక్కుకున్న అమ్మాయిలను కాపాడే లాయర్‌గా పవన్ నటిస్తున్నాడు. ఈ చిత్రంలోని ఫస్ట్‌ లుక్, పాటకు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.

ఒకటి అవకముందే.. మరో రెండు కన్ఫార్మ్

ఒకటి అవకముందే.. మరో రెండు కన్ఫార్మ్

‘వకీల్ సాబ్' సినిమా షూటింగ్ ప్రారంభం కాకముందే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మరో రెండు సినిమాలకు పచ్చజెండా ఊపేశాడు. వీటిలో ఒకటి ఏఎమ్ రత్నం నిర్మాణంలో క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తుండగా.. మరో దానిని మైత్రీ మూవీస్ సంస్థ నిర్మాణంలో హరీశ్ శంకర్ రూపొందిస్తున్నాడు. వీటిలో క్రిష్ సినిమా ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.

అదే ప్రత్యేకం... తొలిసారి పవన్ కల్యాణ్ అలా

అదే ప్రత్యేకం... తొలిసారి పవన్ కల్యాణ్ అలా

ఏక కాలంలో మూడు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు పవన్ కల్యాణ్. ఈ మూడింటిలో క్రిష్ తెరకెక్కించే సినిమా కొంత ప్రత్యేకమనే చెప్పాలి. దీనికి కారణం... ఈ మూవీ పిరియాడిక్ నేపథ్యంతో రూపొందుతుండడమే. మొగలాయిలా కాలం నాటి కథతో వస్తున్న ఈ సినిమా కోహినూర్ డైమండ్ ప్రధానాంశంగా తెరకెక్కుతుందట. దీనికి ‘విరూపక్ష' అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

పవన్ ఇద్దరిలా.. వాళ్లు మాత్రం ఫిక్స్ కాలేదు

పవన్ ఇద్దరిలా.. వాళ్లు మాత్రం ఫిక్స్ కాలేదు


ఈ సినిమాలో పవన్ కల్యాణ్ డుయల్ రోల్ చేస్తున్నాడని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అందులో ఒకటి దొంగ పాత్ర కాగా, మరొకటి పోరాట యోధుని క్యారెక్టర్ అని అంటున్నారు. దొంగ పాత్ర కౌబాయ్‌ని పోలి ఉంటుందని, మరో రోల్‌లో విగ్గుతో కనిపించబోతున్నాడని సమాచారం. అయితే, ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

పవర్ స్టార్ టార్గెట్ మిస్ కాకుండా ప్లాన్.!

పవర్ స్టార్ టార్గెట్ మిస్ కాకుండా ప్లాన్.!

రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఇంకెప్పుడూ సినిమాలు చేయనని, ప్రజాసేవకే తన జీవితం అంకితమని పవన్ చాలాసార్లు ప్రకటించాడు. అయితే, పార్టీ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చాడు. ఇందులో భాగంగానే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నాడు. అంతలో కరోనా రూపంలో ఆయన ప్లాన్ పక్కదారి పట్టింది. దీంతో క్రిష్ అదిరిపోయే ప్లాన్ చేశాడని టాక్.

Recommended Video

#8YrsOfGabbarSingh: Then World Wide Box Office Collections, Now Twitter Records
పవన్ కోసం ఇంజనీర్‌గా మారిన డైరెక్టర్

పవన్ కోసం ఇంజనీర్‌గా మారిన డైరెక్టర్

కరోనా ప్రభావంతో పరిస్థితి మారిపోవడంతో క్రిష్.. పవన్ చెప్పిన సమయానికి సినిమా కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడట. ఇందుకోసం ఇంజనీర్‌గా మారిపోయి ఆర్ట్ డైరెక్టర్‌కు స్వయంగా సెట్ ప్లాన్ గీసి పంపించాడట. పర్‌ఫెక్ట్‌గా ఉన్న ఆ ప్లాన్స్ చూసి సదరు ఆర్ట్ డైరెక్టర్‌ షాక్ అయ్యాడని సమాచారం. లాక్‌డౌన్ అనంతరం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సెట్స్ వేయబోతున్నారని తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X