twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రామ్ చరణ్-క్రిష్ కాంబినేషన్లో... మెగా రీమేక్?

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ చిత్రాల్లో 'జగదేక వీరుడు-అతిలోక సుందరి' మూవీని ప్రముఖంగా చెప్పుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవి - ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు కాంబినేష‌న్... ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ రూపొందిన ఈ చిత్రం అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలో ఓ సంచలనం.

    ఈ సినిమాను మళ్లీ రామ్ చరణ్ తో రీమేక్ చేయాలని.... ఇప్పటి ట్రెండుకు తగిన విధంగా కథలో మార్పులు చేసి మరోసారి బాక్సాఫీసు షేక్ చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ మేరకు అశ్వినీదత్ కొంతకాలంగా ఇందుకు సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నారు.

    తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..... ఈ మెగా రీమేక్ కు చిరంజీవి నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఈ ప్రాజెక్టును తెరకెక్కించే బాధ్యత డైరెక్ట‌ర్ క్రిష్‌ అప్పగించినట్లు సమాచారం. జ‌గ‌దేక‌వీరుడు అనే టైటిల్ ప‌రిశీలిస్తున్నార‌ట‌.

    అయితే ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రామ్ చరణ్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ధృవ' మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మరో సినిమాకు కమిట్ అయ్యారు. ఆ తర్వాతగానీ ఈ సినిమా విషయం తేలే అవకాశం లేదు.

    ------------------------
    గతేడాది(మే , 2015) నాటికి జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా రాఘవేందర్రావు, చిరంజీవి పార్టీ చేసుకున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు మరోసారి మీ ముందుకు....

    సినీ నిర్మాణ ప్రక్రియకి నిలువెత్తు గ్లామరు, గ్రామరుని ఆపాదించిన అపురూప చలన చిత్ర కావ్యం 'జగదేక వీరుడు-అతిలోక సుందరి'. ఊహకే అందరి బడ్జెట్టుతో, అనూహ్యమైన కథతో రంగులతెరని రంజింపజేసిన ఓ ప్రభంజనం. ఓ సంచలన చిత్రం ...1990, మే 9న విడుదలైన 'జగదేక వీరుడు- అతిలోక సుందరి'.

    ఈ సందర్భంగా సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ చిత్ర హీరో చిరంజీవి, దర్శకుడు రాఘవేంద్రరావు, నిర్మాత అశ్వినీదత్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. 25 ఏళ్ల కిందట సినిమా విడుదలైన తర్వాత చోటు చేసుకున్నపరిస్థితులను గుర్తు చేసుకున్నారు.

    'జగదేక వీరుడు-అతిలోక సుందరి' చిత్రం చిత్రం విడుదలైనపుడు పెను తుఫాను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తోంది. ఊళ్లకు ఊళ్లు తుపానులో తూలిపోతున్నాయి. ఆ బీభత్సంలో అశ్వినీదత్ సినిమా విడుదలకు పూనుకుంటే అందరూ ముక్కున వేలేసుకున్నారు.

    ఆ ప్రకృతి వైపరీతంలో అసలు ప్రదర్శనలు జరుగుతాయా? నిర్మాతకి నూకలు దక్కుతాయా అన్న ప్రశ్నలు పరిశ్రమను ఉక్కిరి బిక్కిరి చేసాయి. అశ్వినీదత్ మాత్రం సినిమాపై నమ్మకంతో ధైర్యంగా విడుదల చేసారు. వర్షాన్ని లెక్కచేయకుండా అప్పట్లో థియేటర్లకు జనం క్యూకట్టారు. తుఫాను వారం రోజులు కొనసాగితే వైజయంతి తుఫాను ఊరూరా రెండువందల రోజులు హోరెత్తింది. సినిమాకు మొదట ప్లాప్ టాక్ వచ్చింది. గతి లేని వీరుడు-మతిలేని సుందరి అంటూ కొందరు విమర్శించారు. అయితే సినిమా అనూహ్యంగా పుంజుకుంది. కలెక్షన్ల వర్షం కురిపించింది.

    సెలబ్రేషన్స్

    సెలబ్రేషన్స్


    జగదేక వీరుడు అతిలోక సుందరి
    జగదేక వీరుడు అతిలోక సుందరి సెలబ్రేషన్స్ లో చిరంజీవి, రాఘవేంద్రరావు, అశ్వినీదత్

     ప్లాప్ అన్నారు కానీ..

    ప్లాప్ అన్నారు కానీ..


    "రిలీజైన రోజు..ఆంధ్రాలో సైక్లోన్. అంతా మా సినిమా సూపర్ ఫ్లాప్ అన్నారు. అయితే కొద్దిరోజులు గడిచింది. సినిమా సునామీ తరహా కలెక్షన్స్ తో దుమ్ము రేపింది.

    రీ రిలీజ్

    రీ రిలీజ్

    ఈ చిత్రాన్ని రీరిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిజిటలైజ్ చేసి రీరిలీజ్ చేస్తారని తెలుస్తోంది.
     సూపర్బ్

    సూపర్బ్

    ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణులు ముఖ్యంగా చిత్ర ఛాయాగ్రాహకుడు అజయ్ విన్సెంట్, సంగీత దర్శకుడు ఇళయారాజా అందించిన పాటలు చిత్ర విజయానికి దోహదపడ్డాయి. ఈ చిత్రంలోని ఏడు పాటలూ శ్రోతలను బాగా అలరించాయి. ముఖ్యంగా అబ్బనీ తియ్యనీ దెబ్బ వంటి పాటలు ఇప్పటికీ ఆ పాటలు జనం నోళ్లలో నానుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

     విజయంలో కీలక పాత్ర

    విజయంలో కీలక పాత్ర

    స్టెప్పులతో చిరంజీవి అలరిస్తే దేవకన్యగా శ్రీదేవి, దుష్ట మాంత్రికుడుగా అమ్రిష్ పురి నటన ఈ చిత్రానికే హైలెట్. ఈ చిత్రానికి కురిసిన ప్రశంసల జల్లులో దర్శకుడు రాఘవేంద్రరావు తడిసి ముద్దయ్యారు. ఇక స్వర్గీయ జంధ్యాల రాసిన మాటలు ఈ చిత్ర విజయంలో కీలకపాత్ర పోషించాయి.

    English summary
    Ashwini Dutt has been trying to remake Megastar Chiranjeevi's yesteryear classic hit film “Jagadeka Veerudu Athiloka Sundari” with Ram Charan. Film nagar source said thart Krish To Direct this movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X