క్రేజీ కాంబినేషన్.. బాలయ్య దర్శకుడితో మహేష్, అల్లు అరవింద్ చిత్రం!

Recommended Video

Mahesh27 : Mahesh Babu Movie With Krish | Filmibeat Telugu

సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసేందుకు దర్శకుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. చాలా మంది స్టార్ డైరెక్టర్స్ మహేష్ తో సినిమా చేయడానికి ఆసక్తిగా ఉన్నారు. ఇటీవల కొంతకాలంగా మహేష్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. మెగా నిర్మాత అల్లు అరవింద్ మహేష్ బాబుతో భారీ చిత్రాన్ని నిర్మించే పనిలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కాంబినేషన్ పై అంచనాలు పెంచేలా మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది.

మెగా నిర్మాతతో తొలిసారి

మెగా నిర్మాతతో తొలిసారి

సూపర్ స్టార్ మహెష్ కు మెగా ఫ్యామిలీకి మంచి సన్నిహితసంబందాలు ఉన్నాయి. అందుకే అల్లు అరవింద్ తీసుకొచ్చిన ప్రపోజల్ కు మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఆ మధ్యన ఈ చిత్రానికి అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగ దర్శత్వం వహిస్తాడని ప్రచారం జరిగింది. తనతో ఓ సినిమా చేస్తానని మహేష్ సందీప్ కు మాట ఇచ్చాడు.

సుకుమార్ రెడీగా

సుకుమార్ రెడీగా

మహేష్ ప్రస్తుతం మహర్షి చిత్రంతో బిజీగా గడుపుతున్నాడు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే ఏడాది జనవరి దాదాపుగా పూర్తి కానుంది. ఆ తరువాత సుకుమార్ దర్శత్వంలో చిత్రం ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సుకుమార్ చిత్రం సెట్స్ పై ఉండగానే మహేష్, అల్లు అరవింద్ కాంబినేషన్ లోని చిత్రం ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

బాలయ్య దర్శకుడు

బాలయ్య దర్శకుడు

మహేష్, అల్లు అరవింద్ చిత్రానికి దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడి పేరు వినిపిస్తుండడం ఆసక్తి రేపుతోంది. చాలా ఏళ్లుగా క్రిష్ మహేష్ తో సినిమా చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు. అల్లు అరవింద్ రూపంలో మహేష్ ని డైరెక్ట్ చేసే అవకాశం క్రిష్ కు వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్.

అపారమైన ప్రతిభ

అపారమైన ప్రతిభ

దర్శకుడిగా క్రిష్ లో అపారమైన ప్రతిభ దాగిఉంది. కానీ క్రిష్ ఎంచుకునే కథలలో కమర్షియల్ అంశాలు ఉండవనే విమర్శ ఉంది. అది కనుక సరిచేసుకోగలిగితే మహేష్, అల్లు అరవింద్ కాంబోలో చిత్రాన్ని క్రిష్ డైరెక్ట్ చేయడం ఖాయమని అంటున్నారు. ఆసక్తిరేపుతున్న ఈ కాంబినేషన్ గురించి అధికారిక ప్రకటన రావలసి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X