నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఫిక్స్: అతడి ఎంట్రీ వెనుక పవన్.. బాలయ్యకు ఇష్టమైన డైరెక్టర్‌తోనే!

టాలీవుడ్‌లోకి ఇప్పటికే ఎంతో మంది సినీ స్టార్ల వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొందరు బడా హీరోలుగానూ ఎదిగిపోయారు. ఈ క్రమంలోనే నటసింహా నందమూరి బాలకృష్ణ కూడా తన కుమారుడు మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేస్తానని ఎప్పుడో ప్రకటించారు. కానీ, ఇప్పటి వరకూ అది జరగలేదు. దీంతో నందమూరి అభిమానులు అతడి రాక కోసం వేచి చూస్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా మోక్షజ్ఞ మొదటి చిత్రం ఫిక్స్ అయినట్లు, దానికి దర్శకుడు కూడా కన్ఫార్మ్ అయినట్లు తెలిసింది. ఆ పూర్తి వివరాలను మీరే చూసేయండి మరి!

బాలయ్య ప్రకటనతో హ్యాపీ:టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలు చిరంజీవి, నాగార్జున తన కుమారులను ఎప్పుడో హీరోలుగా పరిచయం చేశారు. ఈ క్రమంలోనే బాలకృష్ణ కూడా తన కొడుకు మోక్షజ్ఞను కూడా సినిమాల్లోకి తీసుకు వస్తారని చాలా ఏళ్ల నుంచే వార్తలు వచ్చాయి. అందుకు అనుగుణంగానే కొన్నేళ్ల క్రితం బాలయ్య అధికారికంగా ప్రకటించారు. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు.

Krish Jagarlamudi To Introduce Nandamuri Mokshagna

మోక్షజ్ఞ లుక్ మారలేదుగా:నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తాడని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ, అతడి లుక్ మాత్రం ఏమాత్రం మారలేదు. పైగా ఈ నందమూరి చిన్నోడు ఆ మధ్య చాలా లావుగా కనిపించాడు. దీంతో మోక్షజ్ఞ సినిమాల్లోకి వచ్చేది అనుమానమే అని అంతా అనుకున్నారు. కానీ, బాలయ్య మాత్రం అతడు త్వరలోనే సినిమాల్లోకి పరిచయం అవబోతున్నట్లు చెప్పారు.

ఆ దర్శకుల పేర్లు వైరల్:మోక్షజ్ఞను హీరోగా పరిచయం చేసే బాధ్యతను బాలయ్య.. రాజమౌళి చేతిలో పెట్టాడని మొదట ప్రచారం జరిగింది. ఆ తర్వాత పూరీ జగన్నాథ్, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, క్రిష్ జాగర్లమూడి సహా ఎంతో మంది డైరెక్టర్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, దీనిపై క్లారిటీ మాత్రం రాలేదు. దీంతో నందమూరి అభిమానులు అయోమయానికి గురి అవుతున్నారు.

Krish Jagarlamudi To Introduce Nandamuri Mokshagna

యాక్టింగ్ కోర్స్‌కు మోక్షజ్ఞ:నందమూరి మోక్షజ్ఞ సినీ రంగ ప్రవేశం గురించి ఇటీవలే ఓ అదిరిపోయే న్యూస్ ఫిలిం నగర్ ఏరియాలో వైరల్ అయింది. దీని ప్రకారం.. అతడు ప్రముఖ నటనా శిక్షకుడు (యాక్టింగ్ గురువు) సత్యానంద్‌ ఇస్టిట్యూట్‌లో మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవడం కోసం జాయిన్ అయ్యాడట. ఇది తెలిసిన తర్వాత అతడి ఎంట్రీపై మరిన్ని ఊహాగానాలు తెరపైకి వస్తూనే ఉన్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ ఫిక్స్:నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీపై తరచూ ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా అతడి తొలి చిత్రం గురించి మరో క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అతి త్వరలోనే అంటే ఈ ఏడాదిలోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ లాంచ్ కాబోతుందట. దీనిపై మరికొద్ది రోజుల్లోనే అధికారిక ప్రకటన వెలువడనుందని సమాచారం.

Krish Jagarlamudi To Introduce Nandamuri Mokshagna

ఆ డైరెక్టర్‌తోనే సినిమా:మోక్షజ్ఞ మొదటి చిత్రం గురించి న్యూస్ లీకైన వెంటనే దాన్ని రూపొందించే డైరెక్టర్ పేరు కూడా బయటకు వచ్చింది. ఈ సినిమాను బాలయ్యకు ఎంతో ఇష్టం అయిన దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే అతడు కథను ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తెలిసింది. ఆ వెంటనే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలెట్టి సినిమాను అనౌన్స్ చేస్తారట.

పవన్ డిసైడ్ అవడంతో:వాస్తవానికి క్రిష్ జాగర్లమూడి పవన్ కల్యాణ్‌తో 'హరిహర వీరమల్లు' అనే సినిమా చేస్తున్నాడు. ఇది మొదలై నాలుగేళ్లు పూర్తైన షూట్ కంప్లీట్ కాలేదు. పైగా ఇప్పుడు పవర్ స్టార్ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. దీంతో ఈ ఏడాది ఈ చిత్రం షూట్‌లో పాల్గొనలేనని చెప్పేశాడట. దీంతో ఇప్పుడు క్రిష్.. మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ కోసం సన్నద్ధం అవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X