ఎన్టీఆర్ బయోపిక్ ప్లాప్ తర్వాత క్రిష్ భారీ ప్లాన్.. మెగా హీరోలు టార్గెట్!
Recommended Video

టాలీవుడ్ లో ప్రతిభావంతులైన దర్శకులలో జాగర్లమూడి క్రిష్ ఒకరు. క్రిష్ చిత్రాలు వైవిధ్యంగా, సందేశాత్మకంగా సాగుతాయి. కానీ క్రిష్ ప్రతిభకు తగ్గట్లుగా కమర్షియల్ హిట్స్ దక్కడం లేదు. అటు నిర్మాతగా, దర్శకుడిగా క్రిష్ రూపొందించిన చిత్రాలు నిరాశపరుస్తున్నాయి. అంతరిక్షం చిత్రానికి క్రిష్ నిర్మాతగా వ్యవహరించాడు. ఆ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక దర్శకుడిగా తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం భారీ అంచనాలతో విడుదలైన దారుణమైన పరాజయానికి గురైంది. ఎన్టీఆర్ బయోపిక్ తో క్రిష్ విమర్శలకు గురయ్యారు. దీనితో క్రిష్ తదుపరి చిత్రం ఏంటనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.

ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలు
క్రిష్ తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం దారుణంగా నిరాశపరిచింది. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద రాణించలేదు. ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంతో క్రిష్ విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. సాధారణంగా విభిన్నమైన కథలు తెరకెక్కించే క్రిష్ బాలయ్య కోరిక మేరకు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అదే విధంగా క్రిష్ దర్శత్వం వహించిన మణికర్ణిక చిత్రం విషయంలో కూడా కంగన రనౌత్ తో విభేదాలు ఏర్పడ్డాయి.

బ్యాడ్ టైం
వరుణ్ తేజ్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శత్వంలో క్రిష్ అంతరిక్షం చిత్రాన్ని నిర్మించాడు ఆ చిత్రం కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం క్రిష్ కు బ్యాడ్ టైం కొనసాగుతోంది. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ దర్శత్వం వహించబోయే చిత్రం గురించి అందరిలో ఉత్కంఠ నెలకొని ఉంది. దీనికి సంబంధించిన ఆసక్తికర వార్తలు వస్తున్నాయి.

భారీ ప్లాన్
క్రిష్ ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ చిత్రానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ తన రచయితల టీంతో కలసి అద్భుతమైన కథని సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ చిత్రంతో తాను దర్శకుడిగా పుంజుకోవాలని క్రిష్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్రిష్ ఎక్కువగా మెగా హీరోలపై ద్రుష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాంచరణ్ లేదా అల్లుఅర్జున్ లలో ఎవరో ఒకరితో ఈ చిత్రం చేయాలని క్రిష్ భావిస్తున్నాడట.

ఇద్దరూ బిజీ
కానీ రాంచరణ్ క్రిష్ కు ఓకే చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యేది 2020లోనే. ఇక అల్లు అర్జున్ కూడా త్రివిక్రమ్ చిత్రంతో బిజీ కానున్నాడు. ఇద్దరు హీరోలు బిజీగా ఉండడంతో క్రిష్ ఎన్ని రోజులు వేచి చూడాల్సి వస్తుందో మరి. క్రిష్ గతంలో అల్లు అర్జున్ తో వేదం చిత్రాన్ని తెరక్కించాడు. రాంచరణ్ తో సినిమా చేసేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











