మహేష్ సమస్యతో తలపట్టుకున్న క్రిష్
మహేష్ బాబు, క్రిష్ కాంబినేషన్ లో ఓ చిత్రం ఓకే అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఓ పెద్ద నిర్మాణ సంస్ధ నిర్మించనుంది. అయితే ఇప్పుడు క్రిష్ కి మహేష్ కి హీరోయిన్స్ ని వెతకటం చాలా ఇబ్బందిగా మారింది. ఆల్రెడీ చేసిన హీరోయిన్స్ పనికిరారు. కొత్తవాళ్లు అంత తేలిగ్గా దొరకరు. అందులోనూ ఈ చిత్రంలో మహేష్ సరసన నటించేందుకు ముగ్గురు హీరోయిన్లు కావాల్సి వుంది. అయితే హీరోయిన్స్ అంటే అలా పాటలకు వచ్చి పోయే బాపతు గాళ్లు కాదని, కథరీత్యా ఉంటారనీ, ఎవరూ ఐటంసాంగ్ చేయరనీ క్రిష్ చెబుతున్నారు. అంతలా కథలోమిళితమైన ఆ పాత్రల్ని ఎంపికచేయడం క్రిష్‌కు పెద్ద సవాల్ గా మారింది. ఈ విషయమై తన సన్నిహితుల వద్ద ప్రస్దావిస్తూ.. సినిమా టైటిల్ కంటే హీరోయిన్ల వేట చాలా కష్టమైందని చెప్పినట్లుతెలిసింది. ఇక ఈ కథని మహేష్ ఇమేజ్ కు తగ్గట్లు, క్రిష్ ప్రయోగానికి ఇమిడేటట్లు.. క్లాస్, మాస్ అంశాలతో రూపొందేలా కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ చిత్రం ప్రారంభం అయ్యేలోగా క్రిష్, రానాల కాంబినేషన్ లో రూపొందే కృష్ణం వందే జగద్గురం చిత్రం పూర్తి చేస్తారు. అలాగే మహేష్ బాబు కూడా సుకుమార్ తో తాను చేయబోయే చిత్రం పూర్తి చేసుకుని ఈ షూటింగ్ కి వస్తారు. గమ్యం, వేదం చిత్రాలతో తనకంటూ క్రేజ్ తెచ్చుకున్న క్రిష్ కు మహేష్ వంటి స్టార్ తో పనిచేయటం చాలా ఆనందపరిచే విషయం.. అదే సమయంలో అలాంటి హీరోతో హిట్ కొట్టాల్సిన భాధ్యత కూడా ఉంది. లేకపోతే పెద్ద హీరోలని డీల్ చెయ్యలేడనే నింద మొయ్యాల్సి వస్తుంది.


Click it and Unblock the Notifications











