twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డైరక్టర్ క్రిష్ కథని రిజెక్టు చేసాడట

    By Srikanya
    |

    హైదరాబాద్ : దర్శకుడుగా క్రిష్ మొదటి నుంచి తనదైన విభిన్న శైలితో ముందుకు వెళ్తున్నారు. ప్రస్తుతం హింది చిత్రం గబ్బర్ షూటింగ్ లో ఉన్న ఆయన తన తదుపరి చిత్రానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆ మేరకు ఆయన అల్లరి నరేష్ కు ఓ కథ చెప్పారని సమాచారం. అయితే అల్లరి నరేష్ 50 వ చిత్రం కోసం ఆ కథ. కథ పూర్తిగా కామెడీగా ఉండాలని భావించిన అల్లరి నరేష్ దాన్ని రిజెక్టు చేసాడని తెలుస్తోంది. క్రిష్ కథ ..సామాజిక అంశాలను ముడివేస్తూ సీరియస్ మోడ్ లో సాగిందని...అటు వంది కథతో తన 50 వ చిత్రం చేసే ఉద్దేశం లేదని చెప్పినట్లు చెప్పుకుంటున్నారు. క్రిష్ దర్శకుడుగా లాంచ్ అయ్యింది..అల్లరి నరేష్ తో చేసిన గమ్యం చిత్రంతో అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం అల్లరి నరేష్ ...తన తాజా చిత్రం బ్రదర్ ఆఫ్ బొమ్మాళి పైనే దృష్టి మొత్తం పెట్టారు.

    ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' విషయానికి వస్తే...

    Krish narrated a story to Allari Naresh

    అల్లరి నరేష్ సినిమాలు వరస ఫెయిల్యూర్స్ ని ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా వచ్చిన జంపు జిలానీ చిత్రం సైతం భాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ నేపధ్యంలో ఆయన తన తాజా చిత్రం
    ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని నవంబర్ 7న విడుదల చేయటానికి నిర్ణయించారు. కొత్త తరహా కథా,కథనంతో చిత్రం రూపొందిందని తప్పకుండా హిట్ అవుతుందని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు. ఇప్పటికే మార్కెట్ వైజ్ గా బాగా డౌన్ లో ఉన్న నరేష్ ఈ చిత్రం హిట్ అయితేనే మార్కెట్ లో నిలదొక్కుకుంటాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ ఆఫ్షన్ అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    అల్లరి నరేశ్‌, కార్తీక కవలలుగా నటిస్తున్న ‘బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళి' సినిమా షూటింగ్‌తో పాటు రీరికార్డింగ్‌ పనులను పూర్తి చేసుకుంది. ఇ.వి.వి. సత్యనారాయణ సమర్పణలో సిరి సినిమా పతాకంపై అమ్మిరాజు కానుమిల్లి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బి. చిన్ని దర్శకుడు.

    నరేశ్‌ మాట్లాడుతూ ‘‘హీరోయిన్‌గా చేస్తున్న టైమ్‌లో సిస్టర్‌గా చెయ్యడానికి ఒప్పుకున్న కార్తీకకు థాంక్స్‌ చెప్పాలి. ఇందులో అందరి బెండు తీసే అమ్మాయిగా వంద శాతం ఆ పాత్రకు న్యాయం చేసింది. ఆమెను ఆపడానికి ప్రయత్నించే బ్రదర్‌గా నానా తంటాలుపడే కేరక్టర్‌ చేశాను. ఇటీవల నా సినిమాలకు ఫ్యామిలీ ఆడియెన్స్‌ మిస్సవుతున్నారనే ఫీలింగ్‌ ఉంది. ఈ సినిమా వాళ్లకు బాగా నచ్చుతుంది'' అని చెప్పారు. దర్శకుడు చిన్ని మాట్లాడుతూ ఇందులో నరేశ్‌ ఫ్రెష్‌లుక్‌తో కనిపిస్తారనీ, ఈ సినిమా తర్వాత శేఖర్‌చంద్ర మంచి మాస్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ అవుతారనీ అన్నారు.

    నరేశ్‌ జోడీగా మోనాల్‌ గజ్జర్‌, కార్తీక సరసన హర్షవర్థన్‌ రాణే నటించిన ఈ చిత్రంలో భానుశ్రీ మెహ్రా, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, జయప్రకాశ్‌రెడ్డి, నాగినీడు, ఎల్బీ శ్రీరామ్‌, జీవా, కెల్లీ డోర్జీ, అభిమన్యుసింగ్‌, వెన్నెల కిశోర్‌, శ్రీనివాసరెడ్డి, సుధ, సురేఖావాణి తారాగణం. ఈ చిత్రానికి పాటలు: భాస్కరభట్ల రవికుమార్‌, శ్రీమణి, స్టంట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, కూర్పు: గౌతంరాజు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు.

    English summary
    Allari Naresh is taking some special care for his 50th film.He has listened the story narrated by Krish but not yet Okayed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X