'వేదం' క్రిష్ నెక్ట్స్ సినిమా టైటిల్ ఏమిటంటే
'గమ్యం' తానేమిటో ప్రూవ్ చేసుకుని 'వేదం' తో నిలదొక్కుకున్న దర్శకుడు క్రిష్. రెగ్యులర్ రూటులో వెళ్ళకుండా విభిన్నంగా ప్రయత్నిస్తున్న క్రిష్ తదుపరి చిత్రాన్ని ఆర్కా మీడియా వారికే చేస్తానని ప్రకటించాడు. అయితే ఆ వివరాలు మాత్రం ఇంకా వెళ్ళడించలేదు. ఓ పెద్ద హీరోతోనే చిత్రం ఉంటుందని, తన బాణీలోనే ఉండబోతోందని మాత్రం క్లూ ఇచ్చాడు. ఈ నేపధ్యంలో ఆర్కా మీడియా బ్యానర్ మీద, క్రిష్ సొంత బ్యానర్ పేరు మీద ఫిల్మ్ ఛాంబర్ లో రెండు టైటిల్స్ రిజిస్టర్ చేయటం ఆసక్తి రేపిన అంశం. అవి..క్రిష్ సొంత బ్యానర్ అయిన ఫస్ట్ ఫ్రేం ఎంటర్ టైన్ మెంట్ పేరు మీద 'అ' అనే టైటిల్ రిజిస్టర్ అయింది. అలాగే ఆర్కా మీడియా పేరు మీద 'జనగణమన' టైటిల్ రిజిస్టర్ చేసారు. ఈ రెండిట్లో క్రిష్ ఏ టైటిల్ ని తన తదుపరి చిత్రానికి వాడతాడో చూడాలి.
వేదం క్రిష్ గమ్యం ఆర్కా మీడియా అల్లు అర్జున్ అనుష్క జనగణమన vedam krish janaganamana gamyam arka media allu arjun


Click it and Unblock the Notifications