క్రిష్ ని బలవంతం చేసి పంజా గురించి
వేదం, మర్యాద రామన్న చిత్రాల తర్వాత ఆర్కా మీడియా వారు తీసిన చిత్రం పంజా. చాలా స్టైలిష్ మేకింగ్,ఒక మంచి టెక్నికల్ వాల్యూస్ ఉన్న చిత్రమిది. పాపారాయుడుగా బ్రహ్మానందం గారు చాలా బాగా చేసారు. పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త గెటప్ తో అద్బుతమైన లుక్ కనిపించారు. పంజా లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ,యాక్షన్ గానీ, ఫైట్స్ గానీ చాలా హైలెట్ గా ఉన్నాయి అంటూ దర్శకుడు క్రిష్ ..పంజా గురించి చెప్తున్న వీడియో ఒకటి యూ ట్యూబ్ లోకి వచ్చింది. దాన్ని మీడియాకు ఇవ్వటానికి నిర్మాతలు ప్లాన్ చేసింది. అయితే ఆ వీడియాలో క్రిష్ కొంత చెప్పి మధ్యలో ఆగి.. ఇంకా నా అని అడిగి కంటిన్యూ చేయటం, ఇంకేమి చెప్పాలి అన్నట్లు చూడటం హాట్ టాపిక్ గా మారింది.
దాంతో ఈ వీడియోని కావాలని క్రిష్ చేత బలవంతంగా నిర్మాతలు చెప్పించినట్లు ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక పంజా చిత్రం కలెక్షన్స్ వీకెండ్ దాటాక తగ్గుమొహం పట్టాయి. పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఈ చిత్రాన్ని పులిని మించిన ప్లాప్ గా అభివర్ణిస్తున్నారు. అయితే పవన్ అభిమానులు మాత్రం కొద్ది రోజులకు ఈ సినిమా జనాల్లోకి వెళ్ళుతుందని,కాస్త టైమ్ పట్టవచ్చునని అంటున్నారు. విష్ణు వర్ధన్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం స్టైలిష్ ఎంటర్టైనర్ గా తెరకెక్కింది.


Click it and Unblock the Notifications











