'పంజా' టైటిల్ ఐడియా ఆ తెలుగు దర్శకుడుదే
పవన్ కళ్యాణ్ తాజా చిత్రం పంజా గురించే ఇప్పుడు ఎక్కడ విన్నా చర్చ. అందులోనూ ఈ టైటిల్ కి విపరీతమైన రెస్పాన్స్ రావటం కూడా ఈ హైప్ కు కారణమైంది. ఇక ఈ చిత్రం టైటిల్ గురించి సినిమా ప్రారంభం నుంచి నిర్మాతలు సెర్చ్ చేస్తూనే ఉన్నారు. మొదట్లో షాడో, కాళి, పవర్ అనే టైటిల్స్ అనుకున్నారు. కానీ చివరకు పంజానే ఫైనలైజ్ చేసారు. అయితే ఈ టైటిల్ ని సజెస్టు చేసింది మాత్రం దర్శకుడు క్రిష్ అని తెలుస్తోంది. నిర్మాతలు పవర్ టైటిల్ ని ఓకే చేసి ప్రొసీడ్ అవుదామనుకున్న సమయంలో క్రిష్ ఈ టైటిల్ ని సూచించటం జరిగిందిట. తన టైటిల్స్ గమ్యం, వేదం లాగే ఈ టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉంటుందని భావించి చెప్పటం వెంటనే పవన్ కళ్యాణ్ కూడా ఓకే చేయటం జరిగిందని ఫిల్మ్ నగర్ సమాచారం.
తమ పంజా చిత్రంలో దెబ్బ తిన్న పులి లాంటి పాత్రను పవన్ కళ్యాణ్ పోషిస్తున్నారనని దర్శకుడు విష్ణువర్ధన్ అంటున్నారు. ఆయన తన తాజా చిత్రం పంజా చిత్రం విశేషాలను మీడియాకు వివరిస్తూ... ఒక్క దెబ్బతో నాడీ వ్యవస్థను సైతం విచ్ఛిన్నం చేసే పవర్ పులి పంజాకి సొంతం. అదే దెబ్బతిన్న పులి అయితే... దాన్ని పంజా శక్తి రెట్టింపవుతుంది. ఇక ఎదుట ఉన్నది మదగజం అయినా సరే.. మట్టిలో కలిసిపోవాల్సిందే. ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఇదే తరహాలో ఉంటుంది. ఆయన స్టామినా ఏమిటో బాక్సాఫీస్‌కి రుచి చూపించే సినిమా ఇది అన్నారు.
కోల్‌కతా నేపథ్యంలో సాగే స్టయిలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ఇది. ఇటీవలే విడుదల చేసిన పవన్‌కళ్యాణ్ స్టిల్స్‌కి అపూర్వమైన స్పందన వస్తోంది. ఇందులో ఆయన గెటప్ ఎంత కొత్తగా ఉందో... పాత్ర చిత్రణ కూడా అంత కొత్తగా ఉంటుంది. స్టయిలిష్ డెరైక్టర్ విష్ణువర్థన్ ఈ సినిమాను న్యూలుక్‌తో ప్రెజెంట్ చేస్తున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా వచ్చాయి. యువన్ శంకర్ రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.


Click it and Unblock the Notifications











