»   » దర్శకుడి కాపురంలో హీరోయిన్ చిచ్చు.. అందుకే విడాకుల కోసం!

దర్శకుడి కాపురంలో హీరోయిన్ చిచ్చు.. అందుకే విడాకుల కోసం!

Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
  Krish,His Wife Separation Reason

  బాలీవుడ్‌ను పోల్చుకుంటే టాలీవుడ్‌లో విడాకుల సంస్కృతి చాలా తక్కువగా కనిపిస్తుంది. తెలుగు సినీ పరిశ్రమలో సంస్కృతి, సంప్రదాయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది కనుక. ఇలాంటి నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు క్రిష్, ఆయన భార్య రమ్య విడాకుల కోసం దరఖాస్తు చేసుకొన్నారనే వార్త సినీ వర్గాల్లోనే కాకుండా అన్ని వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది. ఏడాది కాకముందే దంపతులు విడిపోవడానికి ఓ హీరోయిన్ కారణమనే మాట వినిపిస్తున్నది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనే చర్చ జరుగుతున్నది. సినీవర్గాల ప్రకారం..

  చారిత్రాత్మక చిత్రంలో

  చారిత్రాత్మక చిత్రంలో

  సదరు దర్శకుడు రూపొందించిన ఓ చారిత్రాత్మక చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. ఆ తర్వాత ఓ ప్రముఖ దర్శకుడు, నటుడు కలయికలో వచ్చిన భక్తి, ఆధ్యాత్మిక చిత్రంలో కూడా కీలక పాత్రను పోషించారు.

  ఆఫర్లు లేని హీరోయిన్

  ఆఫర్లు లేని హీరోయిన్

  మంచి ప్రతిభతో పలు చిత్రాల్లో నటించినా పెద్దగా ఆఫర్లు రాలేదు. అయితే ఆ దర్శకుడు తన పెళ్లికి ముందే ఆ హీరోయిన్‌తో అఫైర్ కొనసాగిస్తున్నట్టు సమాచారం. గత రెండేళ్లుగా వారిద్దరూ రిలేషన్ షిప్‌లో ఉన్నట్టు సమాచారం.

  భర్తపై అనుమానం

  భర్తపై అనుమానం

  భర్తపై అనుమానం రావడంతో ముంబైకి వెళ్లి ఆరా తీశారట. దాంతో భర్త అఫైర్ గురించి పలు విషయాలు తెలియడంతో మనస్తాపానికి గురయ్యారట. ఇక చేసేదేమీలేక విడాకులు తీసుకోవడమనే మంచిదని నిర్ణయానికి వచ్చారట. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల పత్రిక కథనంలో పేర్కొన్నది.

  విడాకుల వ్యవహారంపై

  విడాకుల వ్యవహారంపై

  కొద్దివారాలుగా దర్శకుడి విడాకుల వ్యవహారం సినీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దర్శకుడి వైవాహిక జీవితం వైఫల్యం చెందిన వార్త బయటకు పొక్కకుండా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ కుటుంబాలు జాగ్రత్తలు తీసుకొన్నాయట. ప్రస్తుతం బాలీవుడ్‌లో ఓ చారిత్రాత్మక చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తెలుగులో మరో ప్రతిష్టాత్మక చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారు.

  ప్రతిష్టాత్మక చిత్రంలో

  ప్రతిష్టాత్మక చిత్రంలో

  ఇదిలా ఉండగా, ఇండస్ట్రీలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న ఓ బయోపిక్ లాంటి చిత్రంలో సదరు హీరోయిన్‌ను తీసుకోవాలని అనుకొన్నారట. అయితే చివరి నిమిషంలో ఆమెను తొలగించి మరో ప్రముఖ హీరోయిన్‌ను ఎంపిక చేశారు. ప్రస్తుతం ఇటీవలే ఆ చిత్రం షూటింగ్‌లో పాల్గొన్నారు.

  English summary
  Director Krish tied the knot with Ramya Velaga in 2016. And in two years of marriage, the couple has chosen to call it quits. Reports suggest that, Krish and Ramya have filed for divorce via mutual consent. The reason behind the decision is that the couple was facing compatibility issues and chose to part ways amicably.
  దేశంలోనే అతిపెద్ద పొలిటికల్ పోల్: ఈ సర్వేలో మీరు పాల్గొన్నారా?
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more