కమిడియన్ కృష్ణ భగవాన్ పరిస్ధితి మరీ అంత దిగజారిపోయిందా

By Srikanya

కృష్ణ భగవాన్ ఆ మధ్య ఓ కాలేజీ ఫంక్షన్ కి తాగి వెళ్ళి హంగామా క్రియేట్ చేసి అల్లరి పాలైన సంగతి తెలిసిందే.ఆ ఎఫెక్ట్ అతని కెరీర్ మీద బాగా పడినట్లుంది.రోజుకు దాదాపు డబ్బై వేల నుంచి లక్ష రూపాయల వరకూ వసూలు చేసే కృష్ణ భగవాన్ ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నా డేట్స్ ఇవ్వటానికి రెడీ అంటున్నాడు.అయితే తీసుకునే వారే కరువవ్వటంతో కృష్ణభగవాన్ పరస్ధితి కుడితిలో పడ్డ ఎలకలా మారింది.దాంతో ఇంకా బేరం ఆడితే మరింత తగ్గిస్తాడని అతని డేట్స్ చూసే వారు చెప్తున్నారు.అయినా ఎవరూ అతన్ని పెట్టుకోవటానికి సాహసించటం లేదు.దానకి కారణం చిన్న నిర్మాతలు కానీ దర్శకులు కానీ దొరికితే వారిని ఏడిపించుకుతినటం,వారి మాటలు వినకపోవటం,వారి మఖంమీదే మీదొక సినిమానా అన్నట్లు సెటైర్స్ వేయటం ఇవాళ ఇబ్బందిలోకి తోసాయంటున్నారు.

దానికి తోడు ఇండస్ట్రీలోకి వస్తున్న కొత్త దర్శకులు,నిర్మాతలు వీరిని ఓల్డ్ స్టఫ్ గా భావిస్తున్నారు. దాంతో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వేణు మాధవ్,కృష్ణ భగవాన్ లుకు పూర్తిగా డిమాండ్ తగ్గిపోయింది.సెట్స్ మీదకు త్రాగి వస్తున్నారనే టాక్ అంతటా వ్యాపించటం కూడా దీనికి ఒక కారణమంటున్నారు.బ్రహ్మానందం ఎంత టార్చర్ పెట్టినా అతని ఇమేజ్ ఇంకా కొనసాగుతూండటం,శ్రీను వైట్ల పుణ్యమా అని సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్టవటం ప్లస్ అయింది.కృష్ణ భగవాన్ కి వంశి తప్ప వేరే దారి లేదు.వంశీనే సినిమాలు లేక గోళ్ళు గిల్లు కునే పరిస్ధితి.రవితేజతో లేడీస్ టైలర్ సీక్వెల్ చేసే ప్లాన్ లో ప్రస్తుతం ఆయన తిప్పలు పడుతున్నారు.ఇక కృష్ణ భగవాన్ వంక చూసేదెప్పుడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X