For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సరిలేరులో కృష్ణ కనిపించేది అప్పుడే.. అనిల్ రావిపూడి రివీల్ చేయకపోయినా లీక్ అయింది.!

  By Manoj Kumar P
  |
  Super Star Krishna Episode In Sarileru Neekevvaru Is Out

  తెలుగు సినీ ఇంసడ్ట్రీలో టాప్ హీరో చైర్‌పై కన్నేశాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. వరుసగా 'భరత్ అనే నేను', 'మహర్షి' వంటి సూపర్ హిట్ చిత్రాలతో దూకుడు మీదున్నాడు. ఈ క్రమంలోనే అతడు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి 'సరిలేరు నీకెవ్వరు' అనే సినిమా చేస్తున్నాడు. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలే ఉన్నాయి. సంక్రాంతి కానుకగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ అదిరిపోయే సర్‌ప్రైజ్ తాజాగా లీక్ అయిపోయింది. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతోంది. ఇంతకీ ఏంటా సర్‌ప్రైజ్.? పూర్తి వివరాల్లోకి వెళితే...

  వాళ్లందరినీ పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు

  వాళ్లందరినీ పట్టుబట్టి మరీ తీసుకొచ్చాడు

  అనిల్ రావిపూడి.. మహేశ్ కాంబోలో వస్తున్న చిత్రమే ‘సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమా ద్వారా లేడీ అమితాబ్ విజయశాంతి, బండ్ల గణేష్, సంగీత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు. వీళ్లను దర్శకుడు పట్టబట్టి మరీ తీసుకొచ్చాడు. రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ సంగీతం అందించాడు. దిల్ రాజు, అనిల్ సుంకరతో పాటు మహేశ్ దీన్ని నిర్మిస్తున్నాడు.

  అవన్నీ అంచనాలను పెంచేస్తున్నాయి

  అవన్నీ అంచనాలను పెంచేస్తున్నాయి

  సినిమా విడుదలకు సమయం దగ్గర పడడంతో సరిలేరు యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించేసింది. ఇందులో భాగంగానే సినిమా టీజర్, పాటలు, ట్రైలర్‌ను ఒక్కొక్కటిగా విడుదల చేసింది. వీటన్నింటికీ భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. అలాగే, వ్యూస్ పరంగానూ రికార్డులు క్రియేట్ చేశాయి. దీంతో సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.

  ఆ మార్క్ మిస్ అవదు.. కొంచెం కొత్తగా

  ఆ మార్క్ మిస్ అవదు.. కొంచెం కొత్తగా

  ఈ సినిమాను కూడా అనిల్ రావిపూడి తన గత చిత్రాల మాదిరిగానే తెరకెక్కించాడు. తన మార్క్ కామెడీతో కూడిన సీరియస్ డ్రామాగా ఈ సినిమా రూపొందింది. అలాగే, ఈ మూవీలో కొన్ని ఎమోషనల్ సీన్స్ జోడించాడని ప్రచారం జరుగుతోంది. ఆదివారం విడుదలైన ట్రైలర్ చూస్తే ఈ విషయం అర్థం అవుతోంది. అందుకే చిత్ర యూనిట్ ఈ సినిమాపై నమ్మకంగా ఉంది.

  సరిలేరు నీకెవ్వరులో అదిరిపోయే సర్‌ప్రైజ్

  సరిలేరు నీకెవ్వరులో అదిరిపోయే సర్‌ప్రైజ్

  సరిలేరు నీకెవ్వరు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలో దర్శకుడు అనిల్ రావిపూడి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు. ఇందులో మహేశ్ బాబు తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కనిపిస్తారని, అయితే ఎలా కనిపిస్తారు.? ఎందుకు కనిపిస్తారు అనేది మాత్రం థియేటర్లలోనే చూడాలని చెప్పుకొచ్చాడు.

  రివీల్ చేయకపోయినా లీక్ అయింది.!

  రివీల్ చేయకపోయినా లీక్ అయింది.!

  అనిల్ రావిపూడి చేసిన కామెంట్లతో ఈ అంశం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. అదే సమయంలో దీని విషయంలో ఓ వార్త బయటకు వచ్చింది. దీని ప్రకారం... సినిమాలోనే సూపర్ హిట్ సాంగ్ అయిన ‘మైండ్ బ్లాక్'లో కృష్ణ లుంగీ పంచెతో ఎంట్రీ ఇస్తారట. ఆ పాటలో మహేశ్ ఆయనతో కలిసి స్టెప్పులు వేస్తారని ప్రచారం జరుగుతోంది. దీంతో ఘట్టమనేని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

  కృష్ణ వచ్చేది ఎలాగో తెలుసా.?

  కృష్ణ వచ్చేది ఎలాగో తెలుసా.?

  ఈ సినిమాలో కృష్ణ డ్యాన్స్ చేస్తారన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది. అదే సమయంలో ఆయన ఈ వయసులో డ్యాన్స్ ఎలా చేస్తారని అందరిలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీని వెనుక అసలు విషయం ఏమిటంటే.. వెంకటేష్ నటించిన ‘కలిసుందాం రా' సినిమాలో ఎన్టీఆర్‌ను గ్రాఫిక్స్ ద్వారా తీసుకు వచ్చినట్లు.. ఇందులో కృష్ణ స్టెప్పులను ఎడిట్ చేశారట.

  English summary
  Tollywood Superstar Mahesh Babu New movie is Sarileru Neekevvaru. This Film Directed by Anil Ravipudi. In This Movie Mahesh act as major ajay Krishna. Now Intresting update of mahesh Sarileru Neekevvaru is out.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X