పట్టువదలని విక్రమార్కుడులా మహేష్ కోసం వెంటాడుతున్నాడు..!?
చేతిలో బెంజ్ కారు ఉన్నా ఊరి నిండా గతుకుల రోడ్లు వున్నట్టు హీరోగా మహేష్ బాబుకు ఎనలేని క్రేజ్ వున్నా ఒంటి నిండా బద్దకంతో రోజురోజుకీ అందరికీ చులకనవుతున్నాడు. అసలు ఏ సినిమాకు ఎంత సమయం కేటాయిస్తున్నాడో అన్న విషయం తెలియక కొడుకును దారిలో పెట్టాడానికి మహేష్ బాబు తండ్రి కృష్ణ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. అదే తన దర్శకత్వంలో కొడుకున్న నటింపజేయాలనుకోవడం..
ఈ క్రమంలోనే మొన్నటి పుట్టనరోజు వేడుకలో తన మనసులోని మాటను బయటపెట్టిన కృష్ణ పట్టువదలని విక్రమార్కుడిలా కథల కోసం వేటసాగిస్తున్నాడట. భార్య విజయనిర్మల కూడా ఎక్స్ పర్టు కావడంతో వీరికింక హద్దేమీ లేదు. కొన్నాళ్ల క్రితం ఇద్దరూ కలిసీ యాడ్స్ లో కూడా నటించారు. ప్రస్తుతం కృష్ణ కాలీగా ఉండటంతోనే దర్శకత్వం అనే ఆలోచన వచ్చిందని గ్రహించిన మహేష్ బాబు రానున్న చిత్రాల్లో మళ్లీ తన తండ్రికి స్పెషల్ ఎప్పీయరెన్స్ అవకాశాలు ఇద్దామని అనుకుంటున్నాడు. ఎలాగోలా కృష్ణను సైలెంట్ చేయడానికే ఈ మహేష్ 'ఐడియా" అన్నమాట...


Click it and Unblock the Notifications











