అవినీతి రాజకీయాలపై మహేష్ బాబు సినిమా?
సూపర్ స్టార్ మహేష్ బాబు-సెన్షేషన్ దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'బిజినెస్ మేన్' సినిమాకు సీక్వెల్ గా బిజినెస్ మేన్2 సినిమా రూపొందబోతున్న సంగతి తెలిసిందే. పూరి ఈ సినిమా ప్రకటన చేసినప్పటి నుంచే....ఈ సినిమా స్టోరీ ఇదేనంటూ ఓ కథ ప్రచారంలోకి వచ్చింది. పోకిరి, బిజినెస్ మేన్ సినిమాలను మిక్స్ చేసి బిజినెస్ మేన్2 సినిమా తీస్తున్నారని, మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేస్తూ కృష్ణ మనోహర్ ఐపిఎస్, సూర్య భాయ్‌గా నటించనున్నాడని వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
సినిమాలో రెండు పాత్రలు ఇవే అయినా...సినిమా మాత్రం అవినీతి రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఉంటుందని. తొలుత ప్రత్యర్థుల్లా ఉన్న కృష్ణ మనోహర్ ఐపిఎస్, సూర్య భాయ్ ఒక్కటై....అవినీతి రాజకీయ నాయకుల భరతం పడతారని, నెగెటివ్ గా ఉన్న సూర్య భాయ్ పాత్ర పాజిటివ్‌గా బిజినెస్ మేన్2లో పాజిటివ్‌గా చూపించనున్నారని ఫిల్మ్ నగర్ టాక్.
మరి ఈ ప్రచారంలో నిజం ఎంతో దర్శకుడు పూరి స్వయంగా ప్రకటించే వరకు నమ్మకడం కష్టమే. ఈ సినిమాలోని ఇద్దరు మహేష్ బాబుల సరసన నటించే హీరోయిన్లు ఎవరు? అనే దానిపైనా ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇప్పటికే కాజల్, ఇలియాన, సమంత మహేష్ బాబుతో రొమాన్స్ చేశారు. మరి ఈ సారి ఎవరైనా కొత్త వారిని తీసుకుంటారా? లేక వీరిలో ఓ ఇద్దరిని కంటిన్యూ చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











