‘మెగా’ టార్చర్: ఆసుపత్రి పాలైన దర్శకుడు కృష్ణవంశీ?
హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న 'గోవిందుడు అందరి వాడేలే' చిత్రానికి కృష్ణ వంశీ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కృష్ణ వంశీ గురించి కొన్ని ఆసక్తికర వార్తలు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. ఇటీవల ఆయన ఆసుపత్రిలో చేరారని, ఇందుకు కారణం మెగా టార్చర్ వల్ల ఆయన తీవ్రమైన ఒత్తిడికి గురి కావడమే అని అంటున్నారు. మీడియాలో కూడా ఇందుకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.
'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో చిరంజీవి జోక్యం మరీ ఎక్కువైందని....తాను అనుకున్నట్లు కాకుండా చిరంజీవి కోరుకుంటున్నట్లు సినిమా కథలో మార్పులు, రీషూట్లు చేయడం వల్ల కృష్ణ వంశీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారని, ఈ కారణంగానే ఆయన ఆరోగ్యం పాడైందని, హై బీపీతో బాధ పడుతున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజం ఎంతో తేలాల్సి ఉంది.

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ జంటగా క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో, పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత బండ్ల గణేష్ అత్యంత భారీ తారాగణంతో అత్యున్నత సాంకేతిక నిపుణులతో నిర్మిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరి వాడేలే'. శివబాబు బండ్ల సమర్పకుడు. కన్యా కుమారి, పొలాచ్చి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని చిత్ర యూనిట్ హైదరాబాద్ చేరుకున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్ రామానాయుడు సినీవిలేజ్‌లో భారీ సెట్ నిర్మించి కొన్ని సన్నివేశాలు చిత్రీకరణ చేసారు. కొంత షెడ్యూల్ బ్రేక్ తర్వాత జూన్ 5 నుండి తాజా షెడ్యూల్ ప్రారంభించనున్నారు. కుటుంబ కథా చిత్రాల దర్శకుడు అనగానే క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ ఎలా గుర్తొస్తారో...నటుడు ప్రకాష్ రాజ్, జయసుధ కూడా అలాగే గుర్తొస్తారు. వీరి కాంబినేషన్లో వచ్చిన దాదాపు అన్ని సినిమాలు విజయం సాధించాయి. మరోసారి ఈ జంట గోవిందుడు అందరి వాడేలే చిత్రంలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











