చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు మారాడా?
హైదరాబాద్: చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే చర్చ గత కొంతకాలంగా జోరుగా సాగుతున్నసంగతి తెలిసిందే. 150వ సినిమా కావడం, రాజకీయాల తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా కావడంతో ఈచిత్రాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత కొంతకాలంగా కథ గురించి చాలా అన్వేషణ జరిగింది. బెస్ట్ స్టోరీ కోసం చాలా కథలు పరిశీలించారు. చిరంజీవి సినిమా అంటే ఆశామాషీ విషయం కాదు. సత్తా ఉన్న దర్శకుడు కావాలి. అందుకే దర్శకుల విషయంలోనూ మల్లగుల్లాలు పడ్డారు.
చిరంజీవి 150వ సినిమాకు దర్శకుడు ఎవరనే దానిపై ఇప్పటికే చాలా పేర్లు వినిపించాయి. వివి వినాయక్ పేరు, బోయపాటి శ్రీను పేర్లు వినిపించాయి. వివి వినాయక్ ఫైనల్ అయినట్లు ఆ మధ్య వార్తలొచ్చాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. ఇపుడు 150వ సినిమా బాధ్యతలు దర్శకుడు కృష్ణవంశీకి అప్పజెప్పాడని అంటున్నారు.
కృష్ణవంశీ ఇప్పుడు రాంచరణ్ తేజ హీరోగా 'గోవిందుడు అందరివాడేలే' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అయితే నాన్నగారితో 150 చిత్రం మీదే అని రాంచరణ్ అన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో కృష్ణవంశీ ఈ సినిమా మీద ప్రత్యేకదృష్టి కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు. ఈ నేపథ్యంలో ఆయన తన 150వ సినిమా విశేషాలను వెల్లడిస్తారని అంటున్నారు.

150వ సినిమా
కాంగ్రెస్ పార్టీ ఓటమితో ప్రస్తుతానికి పొలిటికల్ టెన్షన్స్ ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నచిరంజీవి తన 150వ సినిమాపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా 150వ సినిమా ప్రారంభించి రాజకీయాల ద్వారా పోయిన పాపులారిటీని మళ్లీ సినిమాల ద్వారా తెచ్చుకోవడానికి చిరంజీవి ఉబలాటపడుతున్నారు.

చిరంజీవి
ప్రతిష్టాత్మక సినిమా చిరంజీవి కెరీర్లో అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు కావడతో ఈచిత్రం నిర్మాణ బాధ్యతలను రామ్ చరణ్ దగ్గరుండి చూసుకోబోతున్నారు. చిరంజీవి భార్య సురేఖ నిర్మాతగా వ్యవహరించనున్నారు.

అన్ని అంశాలతో
150వ సినిమా చిరంజీవి 150వ సినిమాలో అన్ని అంశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమా మంచి కథాంశం, సందేశం, కమర్షియల్ ఎలిమెంట్స్ ఇలా అన్ని విషయాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు.

పుట్టిన రోజు కానుకా?
ఈ సారి మెగా అభిమానులకు చిరంజీవి బర్త్ డే ఆగస్టు 22న 150 సినిమా గురించి అఫీషియల్ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











