కృష్ణ వంశీ దర్శకత్వంలో నితిన్
క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ త్వరలో నితిన్ హీరోగా ఓ సినిమా రూపొందించబోతున్నాడని ఫిల్మ్ నగర్లో ప్రచారం సాగుతోంది. నితిన్‌ను దృష్టిలో పెట్టుకుని కృష్ణ వంశీ ఓ కథను రెడీ చేసుకున్నాడని, నితిన్‌కు కథ వినిపించడంతో అతను కూడా ఓకే చెప్పాడని సమాచారం. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక సమాచారం, పూర్తి వివరాలు వెలువడే అవకాశం ఉంది. చాలా రోజులుగా వరుస ప్లాపులు ఎదుర్కొంటున్న కృష్ణ వంశీ ఇటీవల దర్శకత్వం వహించిన 'మొగుడు' చిత్రం కూడా ఘోరంగా పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఇక నితిన్ ప్రస్తుతం 'ఇష్క్' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదల కాబోతోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని విక్రమ్ కుమార్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఇటీవలే సెన్సార్ పూర్తి చేసుకున్న ఇష్క్ చిత్రం యు/ఎ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. నితిన్ సరసన నిత్యమీనన్ నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్, ఆడియో ఇప్పటికే విడుదలపై సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.


Click it and Unblock the Notifications











