రామ్ చరణ్‌ను టార్గెట్ చేసిన కృష్ణవంశీ?
క్రియేటివ్ దర్శకుడు కృష్ణ వంశీ నెక్ట్స్ టర్గెట్ ఎవరో తెలుసా? ఇంకెవరు టాలీవుడ్ మగధీరుడు రామ్ చరణ్ తేజ అంటూ చర్చించుకుంటున్నారు ఫిల్మ్ నగర్ లో...
మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమా చేయాలని ఉందని కృష్ణ వంశీ గతంలో చాలా సార్లు తన మనసులోని అభిప్రాయాన్ని బయట పెట్టారు. ఒక సారి వందదేమాతం పేరుతో చిరంజీవితో సినిమా చేయాలని ప్రణాళికలు కూడా తయారు చేసుకున్నాడు. కానీ కొన్ని అనుకోని కారణాల వల్ల కృష్ణ వంశీ ఆశ తీరలేదు.
చిరుతో ఎలాగూ చేయలేదు...చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తో సినిమా తీసి మెగా ఫ్యామిలీకి తన పేరుమీద భారీ విజయం అందించాలని కృష్ణ వంశీ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చరణ్ కోసం ఓ కథను తయారు చేశాడని, పరిశీలన నిమిత్తం చరణ్ కు పంపాడని గుసగుస. దీనిపై ఇంకా అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.
ప్రస్తుతం రామ్ చరణ్ సపంత్ నంది దర్శకత్వంలో రచ్చ సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత దిల్ రాజు బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మరో సినిమా కమిట్ అయి బిజీగా ఉన్నాడు. బహుషా ఈ సినిమాలు పూర్తయిన తర్వాత కృష్ణ వంశీతో సినిమా చేయొచ్చు. కృష్ణ వంశీ ఇటీవల మొగుడు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని దాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











