హాట్ న్యూస్: రామ్ చరణ్ నెక్ట్స్ క్రియేటివ్ డైరక్టర్ తో కన్ఫర్మ్
రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి నుంచి క్రియేటివ్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్న కృష్ణ వంశీకి కబురొచ్చింది. ఎప్పుడునుంచో ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తున్న కృష్ణవంశీ ఆగమేఘాలమీద చిరు క్యాప్ లో వాలి..ఓ స్టోరీలైన్ ని అర్జెంటుగా నేరేట్ చేసేసారు. అది విన్న చిరంజీవీ ఇంప్రెస్ అయిపోయి తన కుమారుడు రామ్ చరణ్ తో సినిమా చేయమని చెప్పారని విశ్వసనీయ సమాచారం. ఆ కథ..కొద్దిగా ఆధ్యాత్మికతను ముడివేసుకుని ఉంటుందని అప్పుట్లో కృష్ణవంశీ తయారు చేసుకున్న జెండా పై కపిరాజు కథే అది అని చెప్పుకుంటున్నారు. నిజానికి జెంజాపై కపిరాజు చిత్రాన్ని విష్ణు వర్ధన్ కోసం అని కృష్ణవంశీ రెడీ చేయించారు. సూపర్ హిట్ ఎంటర్ ది న్యూ డ్రాగన్ చిత్రంలోని లైన్ ని మన నేటివిటీకి మార్చి...సీతా దేవి విగ్రహం కోసం ముంబై వచ్చే (ఆంజనేయుడు లాంటి) యువకుడు కధగా అది తయారైంది. ఇప్పుడదే రామ్ చరణ్ కోసం చెప్పి ఉండవచ్చునని చెప్పుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని పిఆర్పీ లీడర్ ఎమ్మల్యే గంటా శ్రీనివాసరావు నిర్మిస్తారు. రామ్ చరణ్ తాజా చిత్రం ఆరెంజ్ షూటింగ్ పూర్తి కాగానే ఈ సినిమా ప్రారంభమవుతుంది. మరో ప్రక్క రామ్ చరణ్..మెరుపు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











