కృష్ణ వంశి దర్శకత్వంలో మెగాస్టార్!?

వాటిల్లో చిరంజీవి తన పార్టీ సిద్దాంతాలు చెబుతూ...ఓటు వేయమని అడుగుతారు. అలాగే ప్రజారాజ్యం సిద్దాంతాలను పాటల రూపంలో తీసే భాద్యత కూడా ఆయనే తీసుకున్నారని చెప్తున్నారు. క్రియేటివ్ డైరక్టర్ గా పేరున్న ఆయనకు పాటలు తీయటంలో మంచి పేరుంది.అలాగే చాలామంది దర్శకులు ఆయనతో పాటలు తీయించుకోవటం కూడా తెలిసిందే. దాంతో ఆ పాటలుని ఫీల్ తో తీయగలరని భావించి ఆయనకు ప్రత్యేకంగా పిలిచి అప్పచెప్తున్నారని తెలుస్తోంది.
రెమ్యునేషన్ కూడా ఆశించకుండా కృష్ణవంశి ఈ ప్రాజెక్టుని చేయటానికి ముందుకొచ్చాడని ఫిల్మ్ నగర్ లో చెప్పుకుంటున్నారు. ఇక కృష్ణవంశి లేటెస్ట్ రొమాంటిక్ కామెడీ శశిరేఖా పరిణయం రిలీజ్ కి రెడీ అయింది. జెనీలియా,తరుణ్ ఈ చిత్రంలో జంటగా కనిపించనున్నారు. త్వరలో ఎలక్షన్స్ దగ్గర పడే సమయానికి కృష్ణ వంశి గీతాలు,ఏడ్స్ మనకి టీవీల్లో కనపడతాయనమాట. మొత్తానికి చిరంజీవిని డైరక్ట్ చేయాలనే ఆయన పూర్తి స్ధాయి కోరిక తీరకపోయినా ఈ రకంగా అయినా సాటిస్ ఫై అవ్వొచ్చు.


Click it and Unblock the Notifications











