నాని, కృష్ణవంశీ టైటిల్...‘జెండాపై కపిరాజు’?
హీరో నాని, క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. తాజాగా సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ఈ చిత్రానికి 'జెండాపై కపి రాజు' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల జరుగుతోంది. రమేష్ పుప్పాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా మళయాళి ముద్దుగుమ్మ కేధరిన్ ధెరిసా చేస్తోంది. కన్నడ లో యోగరాజ్ భట్ చిత్రాలకు కెమెరా అందించే సంతోష్ రాయ్ ఈ చిత్రం తో తెలుగులో పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది.
చాలా కాలంగా సరైన హిట్ లేని క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ మేరకు కథ, స్క్రిప్టు పర్ ఫెక్టుగా ప్లాన్ చేశాడు. సెలెక్టివ్‌గా సినిమాలు చేసుకుంటూ పోతున్న నానికి కూడా కథ నచ్చడంతో ఓకే చెప్పేశాడు. నాని మరో వైపు గౌతం మీనన్ దర్శకత్వంలో 'ఎటో వెళ్లి పోయింది మనసు' చిత్రంలో నటిస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో నాని నటించి 'ఈగ' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











