కౌన్ బనేగా కృష్ణ వంశి హీరో
{image-krishna vamsi_30042008.jpg telugu.filmibeat.com}సమకాలీన అంశాలకు కాల్పనికత అద్ది తెరకెక్కించి హిట్టు కొట్టే దర్శకుడు కృష్ణవంశీ. ఆయన ఈ మధ్య వరుస ఫ్లాపుల్లో ఉన్నారు. తాజాగా తీసిన చిన్న బడ్జెట్ లో చిన్న తారలతో 'చందమామ" చిత్రం తీసి ఎట్టకేలకు విజయాన్ని సాధించాడు. దాంతో ఆయన తర్వాత చేయబోయే ప్రాజెక్టు పైనే అందరి కళ్ళున్నాయి. అంతేగాక విష్ణు హీరోగా కృష్ణవంశీ రూపొందించ తలపెట్టిన 'జెండాపై కపిరాజు" ప్రాజెక్టు..ఆగిపోయిందనే ప్రచారం జరుగుతోంది. స్క్రిప్టు విషయంలో మోహన్‌బాబు, కృష్ణవంశీ మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల ఇలా జరిగిందని అంటున్నారు.దాంతో అందులో ఎవరు ఆయన తరువాత హీరోగా చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా పరిశ్రమ వర్గాలు కి మారింది.
ఇదిలా ఉంటే శ్రీకాంత్ తన వందో సినిమాకి కృష్ణవంశి దర్శకుడు అని ప్రకటించాడు.అతని పరిస్దితి ఈ ఒక్క హిట్టు మూడు ఫ్లాపులతో ముందుకెళుతోంది.దాంతో ఖడ్గం వంటి హిట్ ని తన కెరీర్ లో ఇచ్చిన దర్శకుడు ని నమ్ముదామని డిసైడ్ అయినట్లున్నాడు. మరో ప్రక్క 'నవ వసంతం"తో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన తరుణ్‌కు కృష్ణవంశి ఆఫర్ ఇచ్చారని తెలుస్తోంది. తరుణ్ 'నవ వసంతం" బిలో యావరేజ్‌గా ఆడితే, ఇటీవలి 'భలే దొంగలు" ఫ్లాప్ అయ్యింది. ఇలాంటి స్థితిలో కృష్ణవంశీ నుంచి ఆఫర్ రావడం అతనికి ఆనందాన్ని కలిగిస్తోంది. దాంతో 'చందమామ"తో నవదీప్‌కు బ్రేక్ వచ్చినట్లు తనకు కూడా సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్రేక్ వస్తుందని తరుణ్ ఆశిస్తున్నాడు. ఇలా ఎవరికి వాళ్ళు కృష్ణవంశి ని కన్ ఫర్మ్ చేసుకుంటున్నారు. ఆశ పడుతున్నారు.కాని ఆయన మాత్రం నోరు విప్పి ఫలానా అతనే నా హీరో అని ప్రకటించటం లేదు. నిజానికి ఆయన మనుసులో ఇంకెవరు ఉన్నారో?

Click it and Unblock the Notifications