కృష్ణవంశీ నెక్ట్స్ ఆ హీరోతో కన్ఫర్మ్..షూటింగ్ మార్చినుంచే
కృష్ణవంశీ తన తదుపరి చిత్రం షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది. ఈ చిత్రం హీరో గోపీచంద్. వాంటెడ్ చిత్రం ప్లాప్ తో ఉన్న గోపీచంద్ ఈ కాంబినేషన్ కు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గతంలో గోపీచంద్ తో లక్ష్యం చిత్రం నిర్మించిన నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ప్రస్తుతం బుజ్జి ఆఫీసులో ఈ కొత్త ప్రాజెక్టుకు సంభందించిన స్టోరీ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇక కృష్ణవంశీ కి నాగార్జున,రామ్ చరణ్ లతో కమిట్మెంట్స్ ఉన్నాయి. అయితే నాగార్జునతో చిత్రం చేద్దామనుకుంటే నిర్మాత సి.కళ్యాణ్ ప్రస్తుతం సూరి హత్య కేసు వ్యవహారంలో ఇరుక్కుని ఉన్నారు. రామ్ చరణ్ ప్రాజెక్టుకి మెగా క్యాంప్ లో ఆమోదముద్ర పడలేదు. దాంతో ఆ రెండూ లేటయ్యేటట్లు ఉన్నాయని గోపీచంద్ తో ముందుకు వెళ్థున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రెడీ చేయాలని స్క్రిప్టుపై కుస్తీ పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందు యేలేటి చద్రశేఖర్..ఒక్కడున్నాడు చిత్రం షూటింగ్ సమయంలో గోపంచంద్ తో పాటలను కృష్ణవంశీనే తీసి పెట్టినే అనుభవం ఉంది.


Click it and Unblock the Notifications











