బాలకృష్ణ? నాగార్జున? క్రియేటివ్ డైరక్టర్ డైలమా
క్రియేటివ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీకి రీసెంట్ గా నాగార్జనతో చిత్రం చేయటానికి సి.కళ్యాణ్ నుంచి ప్రపోజల్ వచ్చినట్లు సమాచారం. అయితే ఇప్పటికే బెల్లంకొండ సురేష్ నిర్మాతగా బాలకృష్ణతో చిత్రం చేయటానికి కథ వినిపించినట్లు తెలుస్తోంది. అయితే బాలకృష్ణ సినిమా షూటింగ్ ఏది ముందు ప్రారంభమై ఏది ముగుస్తుంది అనే విషయమై కృష్ణ వంశీ చిత్రం ప్రారంభం ఆధారపడి ఉంటుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ లోగా నాగార్జునతో చిత్రం పూర్తి చేసేయమని సి.కళ్యాణ్ తొందర చేస్తున్నట్లు చెప్తున్నారు. చంద్రలేఖ తర్వాత నాగార్జునతో వచ్చిన విభేధాలు వల్ల ఆ కాంబినేషన్ రిపీట్ కాలేదు. అయితే పాతవన్నీ మరిచి నాగార్జునకి కృష్ణవంశీ స్టోరీలైన్ వివరించటం దానికి నాగార్జున ఓకే చేయటం జరిగాయి. ఇప్పుడు నాగార్జున, బాలకృష్ణలలో ఏది ముందు చేయాలి. ఏది ముందు స్టార్ట్ చేయాలనే డైలమాలో కృష్ణవంశీ ఉన్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక సి.కళ్యాణ్ కి కృష్ణవంశీ గతంలో చందమామ తో హిట్టిచ్చి నిలబెట్టారు. ప్రస్తుతం సి.కళ్యాణ్ నిర్మాతగా దాసరి, బాలకృష్ణ కాంబినేషన్ చిత్రం ప్లానింగ్ జరుగుతోంది.


Click it and Unblock the Notifications











