కృష్ణవంశీని'మొగుడి'చిత్రం నుంచి తీసేసారా?
కృష్ణవంశీ,గోపీచంద్ కాంబినేషన్ లో నల్లమలుపు బుజ్జి నిర్మాతగా 'మొగుడి'అనే చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే.అయితే ఫిల్మ్ సర్క్లిల్స్ లో గత కొద్ది రోజులుగా ఈ చిత్రం ఆగిపోయిందని వినపడుతోంది.అలాగే ఆ డేట్స్ లో యేలేటి చంద్రశేఖర్ చిత్రం పట్టాలు ఎక్కనుందని చెప్తున్నారు.కథ విషయంలో దర్శక,నిర్మాతలుకు ఇద్దరికీ వచ్చిన విభేదాలే కారణమంటున్నారు.అయితే అది కాదని బడ్జెట్ సమస్యలు అని మరో ప్రక్క వినపడుతోంది.అయితే ఇది యేలేటికి కలిసి వచ్చిన అంశం.అతను గత రెండేళ్లుగా ఓ స్క్రిప్టు పట్టుకుని సురేష్ ప్రొడక్షన్స్ చుట్టూ తిరిగి అలిసిపోయాడు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ అనుకున్నాడు కానీ అదీ వర్కవుట్ కాలేదు.ఈ నేపధ్యంలో తనతో ఒక్కడున్నాడు వంటి ఫ్లాప్ ఇచ్చిన గోపీచంద్ అయితేనే బెస్ట్ అని నిర్ణయానికి వచ్చారు.మొత్తానకి అతని కోరిక ఇలా తీరింది.


Click it and Unblock the Notifications











