కృష్ణవంశి మహాత్మకు మూలమదా?

By Staff

శ్రీకాంత్ వందవ చిత్రంగా కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిన చిత్రం 'మహాత్మ'.ఈ చిత్రానికి 1988లో మహేష్ భట్ దర్శకత్వంలో సంజయ్ దత్ హీరోగా వచ్చిన కబ్జా చిత్రం మూలమని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది.మహాత్మ కథ ప్రకారం హింసతో ఏదైనా సాధించవచ్చని నమ్మే దాస్ అనే రౌడీ ఆ తర్వాత మహాత్ముని స్ఫూర్తితో ఆయన ఆశయాల కోసం నడుం బిగిస్తాడు.కబ్జా లోనూ అలాంటి సిట్యువేషన్ ఉంటుంది. అందులోనూ ఈ రెండు చిత్రాలు రియల్ ఎస్టేట్స్ ,కబ్జా బ్యాక్ డ్రాప్ లోనే రూపొందాయి.

ఇక దాస్ పాత్రను శ్రీకాంత్ పోషిస్తున్నారు. ఆయనకు జోడిగా భావన నటిస్తోంది. పరుచూరి సోదరులు రచన చేసిన ఈ చిత్రానికి సిరివెన్నెల-సుద్దాల అశోక్ తేజ-లక్ష్మీభూపాల్ పాటలు, శరత్ సినిమాటోగ్రఫీ, శంకర్ ఎడిటింగ్, విజయ్ ఆంటోని సంగీతం అందించారు. ఆ చిత్రం ఆంధ్రప్రదేశ్ హక్కులను గీతా ఆర్ట్స్ సొంతం చేసుకుంది.అలాగే విజయదశమి రోజు ఈ చిత్రం సెన్సార్ కు వెళ్లింది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రాన్ని చూసి రివైజింగ్ కమిటీకి పంపాలని నిశ్చయించినట్టు తాజా సమాచారం. బుధవారంనాడు ఈ చిత్రాన్ని రివైజింగ్ కమిటీ తిలకించనుంది.

గోల్డెన్ లయెన్స్ పతాకంపై సి.ఆర్.మనోహర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మహాత్మా గాంధీ ముని మనువడు తుషార్ గాంధీ చేతులమీదుగా ఇటీవలే ఆడియో విడుదలైంది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X